ఇడుపులపాయలో వైఎస్ షర్మిల: తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాతో ప్రార్ధనలు

Published : Jul 08, 2021, 09:39 AM IST
ఇడుపులపాయలో వైఎస్ షర్మిల: తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాతో ప్రార్ధనలు

సారాంశం

తెలలంగాణలో ఇవాళ పార్టీని ఏర్పాటు చేయనున్న  వైఎస్ షర్మిల పార్టీ జెండాను తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచి ప్రార్ధనలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె హైద్రాబాద్ లో పార్టీ ఏర్పాటు కు సంబంధించిన ఉద్దేశ్యాలను వివరిసంలీరు.


కడప: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల గురువారం నాడు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.వైఎస్ షర్మిల గురువారం నాడు తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ ఏర్పాటును పురస్కరించుకొని హైద్రాబాద్ నుండి ఆమె నిన్న రాత్రే ఇడుపులపాయకు చేరుకొన్నారు. ఇవాళ ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి  వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత  తదితరులు  వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధి వద్ద తెలంగాణలో ఏర్పాటు చేసే పార్టీ జెండాను ఉంచి ఆమె ప్రార్ధనలు చేశారు. 

ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వైఎస్ షర్మిల  హైద్రాబాద్ కు చేరుకొంటారు. పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాల వేసి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే సమావేశంలో ఆమె పాల్గొంటారు.  ఈ సమావేశంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యాలు,  ఎజెండాపై ఆమె ప్రసంగిస్తారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu