చంద్రబాబు పర్యటన ఎఫెక్ట్... పల్లా దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Published : Feb 16, 2021, 07:41 AM ISTUpdated : Feb 16, 2021, 07:46 AM IST
చంద్రబాబు పర్యటన ఎఫెక్ట్... పల్లా దీక్షను భగ్నం చేసిన పోలీసులు

సారాంశం

గత ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. కాగా... ఈ రోజు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రావాలని అనుకున్నారు.  

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి కృషి ఐకాన్ ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. గత ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. కాగా... ఈ రోజు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రావాలని అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపారు. పల్లా మద్దతు తెలిపేందుకు అమరావతి రైతులు సైతం విశాఖకు వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం