విశాఖ మధురవాడలో డ్రమ్ములో మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. నిందితుడురిషివర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుట్టురట్టు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ మధురవాడ హత్య కేసులో మిస్టరీ వీడింది. నిందితుడు కొప్పిశెట్టి రిషివర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన మహిళ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మీగా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని గుర్తించారు పోలీసులు. కాల్ డేటా ఆధారంగా కూపీ లాగగా.. మిస్టరీ వీడింది. మరోవైపు మహిళ మృతదేహానికి డాక్టర్లు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.
ఏడాదిన్నర క్రితం శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషికి ధనలక్ష్మికి మధ్య పరిచయం ఏర్పడిందని సీపీ శ్రీకాంత్ తెలిపారు. ఆ పరిచయంతోనే మధురవాడలో ఇంటికి తీసుకువచ్చి శారీరకంగా కలిశాడు రిషి. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని డబ్బులు డిమాండ్ చేసింది ధనలక్ష్మి. అయితే విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని సున్నితో మెడను బిగించి ధనలక్ష్మిని హత్య చేశాడు రిషి. అనంతరం మృతదేహాన్ని నీటి డ్రమ్‌లో పెట్టి ఇంటికి తాళం వేశాడు. ఇంటి యజమానికి భార్య డెలివరీకి వెళ్ళింది, వచ్చిన తర్వాత అద్దె చెల్లిస్తామని దాటవేశాడు రిషి.
undefined
ఏడాదికాలంగా అద్దె రాకపోవడం.. ఇల్లు ఖాళీ చేయకపోవడంతో సామాన్లు బయటికి తీసేందుకు రమేష్ వెళ్లడంతో హత్య విషయం బయటపడింది. ఊహించని విధంగా హత్య జరగడంతో మృతదేహాన్ని తరలించలేక నిందితుడు డ్రంలో వదిలేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు ధనలక్ష్మిగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు పంపిస్తున్నామని సీపీ శ్రీకాంత్ చెప్పారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఆయన వెల్లడించారు.
కాగా... వైజాగ్ లో ఓ కాలనీలో డ్రమ్ములో కుళ్లిన స్థితిలో దొరికిన మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మహిళను హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశారు. కుళ్లినా ఏమాత్రం వాసన రాకుండా ఆ శరీర భాగాలను ప్యాక్ చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఢిల్లీలోని శ్రద్ధ వాకర్ హత్య కేసు కంటే దారుణంగా ఈ కేసులో నిందితులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది తీవ్ర భయాందోళనలకు దారితీస్తుంది.
ఓ ఖాళీ ఇంట్లో మహిళ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి.. ఓ పెద్ద డ్రమ్ములో దాచిపెట్టిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విధితమే. ఇంటి నుంచి వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో.. ఇంటి యజమాని వచ్చి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా.. శరీర భాగాలు పెట్టిన ప్లాస్టిక్ సంచులను పూడ్చి పెట్టాలని నిందితులు ప్లాన్ వేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.