మెడికో తపస్విని హత్య కేసు విచారణను అత్యంత త్వరగా పూర్తి చేయాలని మహిళా కమిషన్ ను ఆదేశించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు.
విజయవాడ:మెడికో తపస్వి హత్య కేసులో పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు.ఈ కేసు విచారణను అత్యంత త్వరగా పూర్తి చేయాలని మహిళా కమిషన్ ఆదేశించిందన్నారు. మంగళవారంనాడు ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె తెలిపారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె చెప్పారు.ఇలాంటి ఘటనలను ఎవరూ కూడా ఉపేక్షించబోమని వాసిరెడ్డి పద్మ తెలిపారు.ప్రేమను నిరాకరించే హక్కు కూడా అమ్మాయిలకు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ప్రేమ వ్యవహరాల్లో కక్షసాధించే ధోరణిని మానుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. గతంలో నిందితుడిపై తపస్వి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమై పోలీసులను ఆరా తీసినట్టుగా పద్మ చెప్పారు. కేసులు వద్దని కౌన్సిలింగ్ ఇవ్వాలని తపస్వి కోరిందని పోలీసులు తమకు చెప్పారని పద్మ వివరించారు.ఈ విషయమై ఏం జరిగిందనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరుతామని పద్మ స్పష్టం చేశారు. తపస్వి మరణంతో ఆ కుటుంబం తల్లఢిల్లుతుందని చెప్పారు.
undefined
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పద్మ అభిప్రాయపడ్డారు. తపస్వి ఈ విషయాలపై ఎప్పుడూ తన కుటుంబసభ్యులతో షేర్ చేసుకోలేదన్నారు. ఒకవేళ పేరేంట్స్ కు చెప్పి ఉంటే వారు జాగ్రత్తలు తీసుకొని ఉండేవారేమోనని పద్మ చెప్పారు. ఈ విషయాలను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న తపస్వి పేరేంట్స్ కూడా చెబితే బాగుండేదన్నారు.
also read:గుంటూరులో మెడికో తపస్వి హత్య: గంట ముందే తక్కెళ్లపాడుకి జ్ఞానేశ్వర్, సీసీటీవీ పుటేజీ సీజ్
నిన్న రాత్రి తక్కెళ్లపాడులో తపస్వి ఉంటున్న నివాసం వద్దకు వెళ్లి జ్ఞానేశ్వర్ ఆమెపై సర్జికల్ బ్లేడ్ తో దాడికి దిగాడు. ఈ దాడిలో గాయపడిన తపస్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
తపస్వి, జ్ఞానేశ్వర్ మధ్య ప్రేమ వ్యవహరం సాగుతుందని చెబుతున్నారు. మూడు మాసాల నుండి జ్ఞానేశ్వర్ ను తపస్వి దూరం పెట్టింది.ఈ విషయమై జ్ఞానేశ్వర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిన్న తక్కెళ్లపాడుకు వెళ్లిన నిందితుడు ఆమెతో నిమిషం పాటు గొడవపడి తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న తపస్వి స్నేహితురాలు విభాను ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.