విశాఖలో గుట్టుగా గంజాయి సప్లై... ఎలా చేస్తున్నారంటే...: పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా

Arun Kumar P   | Asianet News
Published : Oct 28, 2021, 01:58 PM IST
విశాఖలో గుట్టుగా గంజాయి సప్లై... ఎలా చేస్తున్నారంటే...: పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా

సారాంశం

విశాఖపట్నంలో గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు యువతలో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు సిపి మనీష్ సిన్హా తెలిపారు. 

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ప్రతిపక్షాల ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అప్రమత్తమయ్యాయి. మాదకద్రవ్యాలతో పాటు గంజాయి అక్రమరవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా గంజాయి ప్రభావం ఎక్కువగా వుండే విశాఖ జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మన్యం ప్రాంతాల్లో గంజాయి పంటను గుర్తించి నాశనం చేయడంతో పాటు స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన విశాఖ నగరంలోనూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. 

''visakhapatnam నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువగా వుంది. అయినాకూడా గంజాయి స్మగ్లింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాం. చిన్నచిన్న ప్యాకెట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించాం. అలా అమ్మకాలు జరిపే ముఠాలను పట్టుకుంటున్నాం. ఇలా రోజుకి రెండుమూడు కేసులు నమోదు చేస్తున్నాం'' అని vizag police commissioner manish sinha తెలిపారు. 

''ఇక ganja వాడకంతో కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇలా ఇప్పటివరకు గంజాయి వినియోగిస్తున్న 226మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం. 'గంజాయి వద్దు‌-చదువే ముద్దు' అనే నినాదం నగరంలోని అన్ని కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి, డ్రగ్స్ మీద పూర్తి నిఘా ఉంచాం'' అన్నారు సిపి మనీష్ కుమార్. 

read more  తూ.గో జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి... కొబ్బరికాయల లోడ్ మాటున హైదరాబాద్ కు స్మగ్లింగ్

ఇదిలావుంటే ఇప్పటికే గంజాయి దందాపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామన్నారు DGP. ఇలాగే గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పలు జిల్లాల ఎస్పీలను goutham sawang ఆదేశించారు. 

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయిని సరఫరా చేస్తున్న పదిహేను వందల వాహనాలను జప్తు చేసినట్లు... ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ  గంజాయి సాగు, రవాణా ను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకు వస్తామని డిజిపి సవాంగ్ హెచ్చరించారు.

read more  గంజాయి దందాపై ఉక్కుపాదం: డీజీపీ గౌతం సవాంగ్

ఇక వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలోనే భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు రెండు కోట్ల విలువైన 2000వేల కిలోల గంజాయి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. ఏపీ నుండే గంజాయి దేశం మొత్తానికి సరఫరా అవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో భారీస్థాయిలో గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. 

 ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడ  డ్రగ్స్ పట్టుబడినా ఏదో విధంగా ఆంధ్ర ప్రదేశ్ తో లింక్ కలిగివుంటోంది. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో పట్టుబడిన వేల కోట్ల విలువచేసే 2,988 కిలోల హెరాయిన్‌ను కూడా విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ చిరునామాతో దిగుమతి అయ్యింది. దీంతో అధికార వైసిపి సహాయంతోనే ఈ డ్రగ్స్ దందా సాగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలోనే ఇటీవల ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి శ్రేణుల మధ్య మాటలయుద్దం పెరగి బౌతిక దాడులకు దారితీసింది. 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!