సింగపూర్ లో భర్త అంత్యక్రియలు.. ఏపీలో భార్యకు వాట్సాప్ లో ఫోటోలు

By telugu news team  |  First Published Apr 8, 2020, 12:27 PM IST

అక్కడ ఒక కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పనిచేస్తుండగా సూర్యారావు మృతి చెందినట్టు సంబంధిత  కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్‌లో తమకు సమాచారమిచ్చినట్టు అతడి భార్య శ్రావణి చెప్పారు.
 


లాక్ డౌన్ కారణంగా ఓ మహిళకు కనీసం తన భర్త ఆఖరి చూపు కూడా దక్కలేదు. పరాయి దేశంలో భర్త అంత్యక్రియలు జరిగితే.. ఆమెకు వాట్సాప్ లో ఫోటోలు పంపించారు. ఈ దయనీయ సంఘటన విశాఖ లో చోటుచేసుకుంది.

Also read ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...

Latest Videos

పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖ జిల్లా వమ్మవరం గ్రామానికి చెందిన సూర్యారావు(35) కుటుంబ పోషణ నిమిత్తం నాలుగు నెలల కిందట సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం పనిచేస్తుండగా సూర్యారావు మృతి చెందినట్టు సంబంధిత  కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్‌లో తమకు సమాచారమిచ్చినట్టు అతడి భార్య శ్రావణి చెప్పారు.

తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియలేదని, ప్రమాదమా?, మరేమైనా కారణమా? అనేది చెప్పలేదని వాపోయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చే దారి లేక అక్కడ వున్న సూర్యారావు స్నేహితులు, సిబ్బంది, తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించి ఆ వీడియో, ఫొటోలు తమకు పంపారని శ్రావణి చెప్పారు. 

కాగా.. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇద్దరి వయసు ఐదేళ్లలోపే ఉండటం గమనార్హం. భర్త మృతితో తమ కుటుంబం వీధిన పడిందని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!