మార్లిన్ చేప దాడిలో మత్స్య కారుడు మృతి.. విషాదంలో విశాఖ తీరం.. (వీడియో)

Published : Feb 03, 2022, 09:22 AM IST
మార్లిన్ చేప దాడిలో మత్స్య కారుడు మృతి.. విషాదంలో విశాఖ తీరం..  (వీడియో)

సారాంశం

ఉదయం 7 గంటలకు, వారి వలలో దాదాపు 70 కిలోల బరువున్న మార్లిన్ చేప (స్థానిక మత్స్యకారులు దీనిని కొమ్ము కోణం అని పిలుస్తారు) పడినట్టు కనుగొన్నారు. అయితే అది చాలా బరువుగా ఉండడంతో వారు దాన్ని తమ పడవలోకి లాగలేకపోయారు. దీంతో వారికి సాయం చేయడానికి జోగన్న  సముద్రంలోకి దూకాడు. అయితే వలలో చిక్కిన  ఆ భారీ చేప తప్పించుకునే ప్రయత్నంలో జోగన్న పొట్టపై షార్ప్ గా ఉన్న ముక్కుతో దాడి చేయడంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

విశాఖపట్నం : Visakhapatnam తీరంలోని పరవాడ మండలం ముత్యాలంపాలేంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. Bay of Bengalలో బుధవారం చేప దాడిలో Fisherman మృతి చెందాడు. ఈటెలాంటి ముక్కుతో ఉన్నపెద్ద marlin చేప, ఒక మత్స్యకారుడిని పొట్టన పెట్టుకుంది.

"

విశాఖపట్నం జిల్లాకు చెందిన బాధితుడు, 40 ఏళ్ల మొల్లి జోగన్న, విశాఖపట్నం దక్షిణాన ఉన్న పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడ్డుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో లోతైన సముద్రంలో మరో నలుగురు మత్స్యకారులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లిన సమయంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చేపల వేట కోసం లోతైన సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు బుధవారం ఉదయం వరకు చేపల వేట కొనసాగించారు.

ఉదయం 7 గంటలకు, వారి వలలో దాదాపు 70 కిలోల బరువున్న మార్లిన్ చేప (స్థానిక మత్స్యకారులు దీనిని కొమ్ము కోణం అని పిలుస్తారు) పడినట్టు కనుగొన్నారు. అయితే అది చాలా బరువుగా ఉండడంతో వారు దాన్ని తమ పడవలోకి లాగలేకపోయారు. దీంతో వారికి సాయం చేయడానికి జోగన్న  సముద్రంలోకి దూకాడు. అయితే వలలో చిక్కిన  ఆ భారీ చేప తప్పించుకునే ప్రయత్నంలో జోగన్న పొట్టపై షార్ప్ గా ఉన్న ముక్కుతో దాడి చేయడంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

జోగన్నపరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధిలోని జాలరిపేటలో నివసిస్తాడు. జోగన్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించినట్లు పరవాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.ఈశ్వరరావు తెలిపారు. మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం బ్రాంచ్‌లోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎమ్‌ఎఫ్‌ఆర్‌ఐ) హెడ్ డాక్టర్ శుభదీప్ ఘోష్‌ దీనిమీద మాట్లాడుతూ మార్లిన్ చేపలు చాలా దూకుడుగా ఉంటాయని, అత్యంత వేగంగా ఈత కొట్టగలవని చెప్పారు. “విశాఖపట్నం తీరంలో మార్లిన్ చేపలు పుష్కలంగా ఉన్నాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలంలో గాలి దిశలో మార్పుల కారణంగా ఇవి తీరానికి దగ్గరగా వస్తాయి. ఇవి సాధారణంగా లోతైన సముద్రంలో ఈదుతాయి. వీటికి ఉండే sharp upper snouts కారణంగా, అవి మత్స్యకారుల శరీరంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి” అన్నారు.

అయితే ఇదేం కొత్త కాదని.. సముద్ర జాతులపై తన 15 ఏళ్ల పరిశోధనలో చేపల వల్ల అనేక మంది గాయపడడాన్ని తాను చూశానని, అయితే ఈ చేప మనిషిని చంపేయగలదని తాను వినడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. "సాధారణంగా, చేపల దాడుల కారణంగా మనుషులు మరణించడం లాంటి సంఘటనలు US, ఆస్ట్రేలియా తీరాలలో నమోదయ్యాయి" అని చెప్పాడు.

విశాఖపట్నం మత్స్యకార యువజన సంక్షేమ సంఘం నాయకులు అర్జిలి దాస్ మాట్లాడుతూ ఇప్పటివరకు చరిత్రలో తమ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారెవరూ చేపల దాడిలో మరణించలేదని అన్నారు. "బుధవారం జరిగిన సంఘటన నుండి గుణపాఠం నేర్చుకున్నాం. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మేము మా వాళ్లకు కూడా చెబుతున్నాం" అని అతను చెప్పాడు.

మార్లిన్, క్రూరమైనది.. 

- మార్లిన్ Istiophoridae కుటుంబానికి చెందినది
- ఇది ఈటె లాంటి ముక్కు లేదా బిల్ కలిగి ఉంటుంది
- పొడవైన దృఢమైన డోర్సల్ ఫిన్
- మార్లిన్లు అత్యంత వేగంగా ఈదే సముద్రపు చేప 
- ఒక చిన్న చేప పిల్ల ఒక్క ఉదుటున గంటకు 110 కి.మీలు ఈదగలదు
- అధికంగా చేపలు పట్టడం వల్ల అట్లాంటిక్ బ్లూ మార్లిన్, వైట్ మార్లిన్ చేపలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి

మార్లిన్ చేపల విక్రయం.. 
- గత ఫిబ్రవరిలో Hydలో మార్లిన్ రూ. 40కే విక్రయించారు. 
- ఫిబ్రవరి 2021లో, హైదరాబాద్‌లోని మణికొండలోని నాన్ ఫిష్ మార్ట్‌లో 78 కిలోల బరువున్న బ్లాక్ మార్లిన్ చేపను రూ.40,000కు విక్రయించారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే ఈ చేప విశాఖ తీరం వెంబడి సముద్రపు నీటిలో చిక్కుకుని దొరికింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu