ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్త ఎన్ని కేసులంటే..?

Siva Kodati |  
Published : Feb 02, 2022, 06:21 PM ISTUpdated : Feb 02, 2022, 06:25 PM IST
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్త ఎన్ని కేసులంటే..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 5,983 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,86,566కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 5,983 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,86,566కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,631కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 11,280 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,73,313కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 35,040మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,40,787కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,00,622 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 488, చిత్తూరు 462, తూర్పుగోదావరి 741, గుంటూరు 738, కడప 608, కృష్ణ 618, కర్నూలు 579, నెల్లూరు 304, ప్రకాశం 293, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 388, విజయనగరం 112, పశ్చిమ గోదావరిలలో 565 చొప్పున వైరస్ బారినపడ్డారు.

కాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కరోనా వివరాలపై బులెటిన్(Health Ministry Corona Bulletin) విడుదల చేసింది. దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.

ఒమిక్రాన్ మూలంగా మన దేశంలో మరోసారి కేసులు పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో కేసులు ఒకానొక దశలో మూడున్నర లక్షలకు చేరువ అయ్యాయి. జనవరి 21వ తేదీన 3.47 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్‌లో పీక్ 3.47 లక్షల కేసులే. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 1.61 లక్షలకు తగ్గాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతున్నది. తాజాగా నమోదైన మరణాలు ఈ ఏడాదిలోనే అత్యధికం. థర్డ్ వేవ్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. వారం క్రితం కరోనా మరణాల సంఖ్య 500 నుంచి 600 మధ్యలో ఉన్నది. 28వ తేదీన కాస్త పెరిగి 627కు పెరిగాయి. ఆ తర్వాత పెరుగుతూ మొన్న(నిన్నటి బులెటిన్‌లో) వెయ్యి మార్క్‌ను క్రాస్ అయ్యాయి. తాజాగా, ఈ మరణాలు మరింత పెరిగి రెండు వేలకు చేరువగా వెళ్లడం గమనార్హం.

ఇవాళ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తాజాగా చోటుచేసుకున్న 1,733 మరణాలతో దేశంలో మొత్తం మరణాలు ఐదు లక్షలకు చేరువయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 4,97,975కి పెరిగాయి. 1,61,386 రికవరీలతో మొత్తం రికవరీల సంఖ్య 3,95.11,307కి చేరాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి పడిపోయింది. కాగా, వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉన్నది.
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu