విశాఖపట్నంలో వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. పెళ్లికి మూడు రోజుల ముందు అతడితో చాటింగ్..

Published : May 23, 2022, 09:25 AM ISTUpdated : May 23, 2022, 09:30 AM IST
విశాఖపట్నంలో వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. పెళ్లికి మూడు రోజుల ముందు అతడితో చాటింగ్..

సారాంశం

విశాఖపట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై సృజన అనే వధువు  కుప్పకూలి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే  తాజాగా సృజన మృతికి సంబంధించిన మిస్టరీ వీడింది. 

విశాఖపట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై సృజన అనే వధువు  కుప్పకూలి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే  తాజాగా సృజన మృతికి సంబంధించిన మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృజనకు శివాజీతో పెళ్లి ఇష్టం లేదని.. పెళ్లిని ఆపేందుకు యత్నించిన క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. సృజన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. 

పరవాడకు చెందిన మోహన్‌ అనే వ్యక్తితో సృజన ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్లికి సమయం కోరినట్టుగా తెలిసింది. మరోవైపు సృజనకు కుటుంబ సభ్యులు శివాజీతో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే  తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని, ఎలాగైనా తనను తీసుకుపోవాలని మోహన్‌ను సృజన కోరింది. రెండేళ్లు ఆగాలని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, మంచి ఉద్యోగం రాగానే తీసుకెళ్తానని మోహన్ సృజనకు తెలిపాడు.

ఇక, పెళ్లికి 3 రోజుల ముందు సృజన ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా సృజన ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలో భాగంగా సృజన విషపదార్థం తినింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆమె పెళ్లీ పీటల మీదే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 

అసలేం జరిగింది.. 
హైదరాబాద్‌కు చెందిన ముజేటి ఈశ్వరరావు, అనురాధ దంపతులు వారి కుమార్తె సృజనకు టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పీఎం పాలెంకు చెందిన నాగోతి శివాజీ(29)తో వివాహం నిశ్చయించారు. అయితే వివాహ వేడుక జరుగుతున్న సమయంలో.. కొన్ని పూజలు పూర్తయిన తర్వాత వధువు తలపై జీలకర్ర, బెల్లం ముక్కలను ఉంచమని పూజారి వరుడికి చెప్పారు. ఆ సమయంలో సృజన ఒక్కసారిగా వివాహ వేదికపై కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. 

సృజన పెళ్లికి సుముఖంగా లేకపోవడంతో ఏదో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.  అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. సృజన ఇష్టంతోనే పెళ్లి నిర్ణయం జరిగిందని అన్నారు. పెళ్లికి రెండు రోజులు ముందు నుంచి సృజన అనారోగ్యంతో ఉన్నట్టుగా చెప్పారు. అయితే అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. ప్రేమ వ్యవహారంతోనే సృజన పెళ్లినే ఆపే యత్నంలో ప్రాణాలు కోల్పోయిందని తేల్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే