అనంత ఉదయభాస్కర్ సీఎం జగన్, మరో ఇద్దరికి బినామీ.. అందుకే అరెస్ట్ చేయడం లేదు.. హర్హకుమార్...

Published : May 23, 2022, 06:46 AM IST
అనంత ఉదయభాస్కర్ సీఎం జగన్, మరో ఇద్దరికి బినామీ.. అందుకే అరెస్ట్ చేయడం లేదు.. హర్హకుమార్...

సారాంశం

వైసీపీ ఎమ్మెల్సీ అనంతఉదయభాస్కర్ ను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. అనంత ఉదయభాస్కర్ ఆ ముగ్గురికీ అనంతబాబు బినామీ అనీ... ఏ స్థాయిలో సపోర్ట్ లేకపోతే చంపేస్తారని ప్రశ్నించారు. 

అమలాపురం : వైసీపీ ఎమ్మెల్సీ Anantha Udayabhaskar మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం death వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సిబిఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎంపీ Harshakumar కోరారు. అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం YS Jagan, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ అనంత బాబు Binami అని హర్ష కుమార్ ఆరోపించారు. అందుకే కళ్ళముందే తిరుగుతున్నా అతడిని పట్టుకునేందుకు పోలీసులు సాహసించడం లేదని చెప్పారు.

ఏజెన్సీలో గంజాయి నుంచి గనుల వరకు అక్రమాలన్నీ అనంత బాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని... గెస్ట్ హౌస్ లు, ఇతర రహస్య ప్రదేశాలు డ్రైవర్ సుబ్రమణ్యానికి తెలుసునని తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు అక్కడక్కడ మాట్లాడుతున్నాడనే.. సుబ్రమణ్యాన్ని చంపేశారని హర్షకుమార్ ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ తీసుకువెళ్లి చంపేసి తీసుకు వచ్చాడని.. అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తారని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం శనివారం అర్ధరాత్రి కాకినాడ జిజిహెచ్ నిర్వహించారు. ఈ మొత్తం పోస్టుమార్టం వీడియో తీశారు. ఇక సుబ్రమణ్యం మృతి కేసులో పోలీసులు ఉదయభాస్కర్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఉదయభాస్కర్ ను అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్ పి రవీంద్ర బాబు ప్రకటించారు. అనుమానాస్పద మృతి కేసు హత్య కేసు మార్చినట్లు వెల్లడించారు. ఉదయ భాస్కర్ ను అరెస్టు చేస్తామని సుబ్రమణ్యం కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే సుబ్రమణ్యం పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో అతడిని కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. 

మృతుడి పట్టాలపై బీచ్ లో మట్టి, ఇసుక... ఒంటిపై కాలితో తన్నిన గుర్తులు, సుబ్రహ్మణ్యం తల మీద ఎడమ వైపు గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు పై కుడి కాలు బొటన వేలుపై, కుడి కాలు మడమ దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయభాస్కర్ ను ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు అనంత ఉదయభాస్కర్ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. 

ఇక ఈ కేసులో ఉదయభాస్కర్ ను అరెస్టు చేయాలని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కాకినాడ జిజిహెచ్ వద్ద నిరసనకు దిగారు. సుబ్రమణ్యం మృతిపై టిడిపి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ కాకినాడ జిజిహెచ్ మార్చురీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు శనివారం సుబ్రమణ్యం తల్లిదండ్రులు, అపర్ణ శనివారం పగలు కనిపించకుండా పోయారు. 

ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. చివరికి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను సాయంత్రం పోలీసులు కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు తీసుకువచ్చారు. ఆ తరువాత శవపంచనామా నిర్వహించారు. అయినప్పటికీ పోస్టుమార్టమ్ అంగీకారపత్రంపై సంతకాలు చేసేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్