చిత్తూరులో జంటహత్యల కలకలం.. భర్త దగ్గరికి వెడతానందని దారుణం...

Published : May 23, 2022, 09:07 AM IST
చిత్తూరులో జంటహత్యల కలకలం.. భర్త దగ్గరికి వెడతానందని దారుణం...

సారాంశం

వారిద్దరిదీ ప్రేమ వివాహం.. కానీ మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. మరో వ్యక్తితో భార్య ఉండడం తట్టుకోలేక భర్త స్వయంగా వచ్చి తనతో వచ్చేయమన్నాడు. ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇంతలోనే... 

చిత్తూరు : Chittoor జిల్లా సదుం మండలంలో twin murders శనివారం కలకలం రేపాయి. అమ్మగారిపల్లె పంచాయతీ ఎగువ జాండ్రపేట లోని వాటర్ ప్లాంట్ వద్ద  ద్దరిని ఎవరో murder చేసినట్లు ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి సీఐ గంగిరెడ్డి,  చౌడేపల్లి ఎస్ ఐ రవి కుమార్ పరిశీలించారు. హత్యకు గురైనవారు  రాధా, వెంకటరమణ గా గుర్తించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు అంగళ్లుకు చెందిన  రాధ (28)కు పుట్టపర్తి ఎనమలవారి పల్లెకు చెందిన  నరసింహులుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. 4 నెలల క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె తన కూతురు సాయి తేజతో కలిసి విడిగా ఉంటుంది.  

ఈ క్రమంలో తన అన్న వెంకటరమణ(37), స్నేహితుడు రాముతో కలిసి గత నెల జాండ్రపేటలోని ఓ ప్రైవేటు వాటర్ ప్లాంట్ లో కూలిపనులకు చేరి, అక్కడే నివాసం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం భర్త నరసింహులు అక్కడికి వచ్చి తనతో వచ్చేయడంతో వివాదం చెలరేగింది. ఇటీవల తిరిగి తాను భర్త వద్దకు వెళ్లిపోతానని రాధా, రాముకు చెప్పడంతో గత కొద్ది రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను వారిద్దరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను బండరాయితో కొట్టి చంపగా, వెంకటరమణ చెవి కింది భాగంలో గాయమైంది. సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాయితేజ(4)ను విచారిస్తున్నారు.  వీఆర్వో మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు. 

ఇదిలా ఉండగా, మే 20న హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను ఏం మార్చి మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిలో ఒకరి ప్రాణాలు తీసిన ఓ మహిళ నిజస్వరూపం బయట పడింది. పది రోజుల కిందట హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన మర్డర్ మిస్టరీ లో వెలుగుచూసిన తాజా షాకింగ్ న్యూస్ ఇది. మే 4వ తేది అర్ధరాత్రి మీర్పేటలోని నంది హిల్స్ చౌరస్తాలో దాడికి గురై చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృతి చెందిన యశ్ కుమార్ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

విచారణలో వారి నుంచి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. విక్రమ్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న శ్వేతారెడ్డి... ఫేస్బుక్లో పరిచయమైన యశ్ కుమార్ తో నాలుగేళ్ల కిందట రిలేషన్ పెట్టుకుంది.  తర్వాత కృష్ణాజిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కొంగళ్ల అశోక్ తో కూడా అక్రమ సంబంధం  కొనసాగిస్తోంది. ఈ క్రమంలో న్యూడ్ ఫోటోలు బయటపెడతానని హెచ్చరించిన యశ్ కుమార్ ని వదిలించుకోవాలని  ప్లాన్ చేసి..  ఆ స్కెచ్ లో సెకండ్ బాయ్ ఫ్రెండ్ అశోక్ ని వాడేసుకుంది. 

బైక్ మీద వెళ్తున్న యశ్ కుమార్ ని సుత్తితో దారుణంగా కొట్టి పారిపోయాడు అశోక్. ఆ దారిన వెళుతున్న కొందరు యశ్ కుమార్ ను కాపాడి ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. అతను రెండు రోజుల తర్వాత చనిపోయాడు. స్పాట్ లో  స్మార్ట్ ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేసి.. అసలు మిస్టరీని ఛేదించారు పోలీసులు.  భర్తకు తెలియకుండా ఒక బాయ్ ఫ్రెండ్ సాయంతో మరో బాయ్ ఫ్రెండ్ ను చంపించిన శ్వేతారెడ్డి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్