
విశాఖ విమానాశ్రయాన్ని మూసేయాలని రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించింది.
2020లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి కాగానే, విశాఖవిమనాశ్రయాన్ని మూసేస్తారు.
అపుడది ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రభుత్వం పెద్దల హెలికాప్టర్ లేదా ప్రత్యేకవిమానం దిగేందుకు పరిమితం అవుతుంది. ఈ అరతర్జాతీయ విమానాశ్రయాన్ని 2020 జూన్ 30 దాకా మాత్రమే నడపాలని ఆరోజు మూసివేయాలని నిర్ణయించారు. ఇదే విధంగా శ్రీకాకుళం విమానాశ్రయం ప్రతిపాదన కూడా విరమించుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జిల్లాకొక విమానాశ్రయం పథకం కూడా కొన్నిమార్పులకు చేర్పుకు లోనవుతూ ఉంది. రాష్ట్రంలో విమానాలు నడపాలనే వారి కోరిక మేరకు, విమానాశ్రాయలను నిర్వహించే సంస్థల సౌలభ్యం కోసం ఈ రద్దుల జరుగుతున్నాయి. సభల్లో చప్పట్లకోసం, రియల్ ఎస్టేట్ వ్యాపార సందడి కోసం ప్రకటించిన 13 విమానాశ్రయాలలో కొన్ని విమానాశ్రయాలను రద్దు చేయాలని ఇపుడు నిర్ణయించింది. ముందు ముందు మరికొన్ని ఎగిరిపోనున్నయాని అధికారులు చెబుతున్నారు. ఇపుడు రద్దయిన వాటిలో నెల్లూరు జిలా దగదర్తి విమానాశ్రయం ఒకటి. అయితే, ప్రకటించిన ఏడాదిన్నరకు ఈ ప్రతిపాదన ఉప సంహరిరచుకుంటున్నారు. విమానాశ్రయం వస్తావుందని చెప్పి అక్కడ భూముల వ్యాపారం బాగానే చేసుకుని ఉంటారు.
నెల్లూరుకు దగ్గరలో విమానాశ్రయం లేనందున దగదర్తిలో ఒక విమానాశ్రయం ఉండాలని ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటినుంచి కలకలంటూ వచ్చారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ మధ్యలో ఏమయిందో ఏమో అసలు విమానాశ్రయం ఉండాల్సింది కృష్ణపట్నంలో కదా అని అనిపించింది. వెంటనే దగదర్తి ప్రతిపాదన అవసరం లేదని విరమించుకున్నారు.
ముఖ్యమంత్రి జిల్లాకొక విమానాశ్రయ ప్రతిపాదనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక విమానాశ్రయం పడేశారు. కిడ్నీజబ్బులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో మొన్నటి దాకా డయాలిసిస్ సెంటర్లు లేవు. అయితే అంతకంటే విమానాశ్రయమే వచ్చేంత ప్రకటన చేశారు ముఖ్యమంత్రి.
ఇపుడు ఇది కుదరదని చెబుతున్నారు. కారణం, పక్కనే ఉన్న విజయ నగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయమే వసున్నందున శ్రీకాకుళంలో కొత్త విమానాశ్రయం అవసరం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భోగాపురం వల్లే విశాఖ అరతర్జాతీయ విమానాశ్రయాన్నికూడా మూసేయాలనుకుంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేముందు వైజాగ్ ను మూసేయాలని భోగాపురం డెవెలపర్ షరతు పెట్టినందుకు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలిసింది. అందువల్ల భోగాపురం కొత్త విమానాశ్రయం 2020 ప్రారంభంలోనే పూర్తి చేయాలని , 2020 జూన్ 30 నుంచి విశాఖ విమానాశ్రయాన్ని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయిరచారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన సంస్థకు, రక్షణ శాఖకు తెలియచేయడం కూడా జరిగింది.