వైఎస్ షర్మిలా, విజయమ్మల్లో ఒకరికే ఎంపీ టికెట్ అని చెప్పిన వివేకా - కొమ్మా శివచంద్రారెడ్డి స్టేట్ మెంట్

By Asianet News  |  First Published Jul 25, 2023, 7:56 AM IST

వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ రాదని వైఎస్ వివాక చెప్పారని కొమ్మా శివచంద్రారెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపారు. ఆయనకు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే వైఎస్ షర్మిలా, విజయమ్మలో ఒకరికి మాత్రమే కడప ఎంపీ టికెట్ వస్తుందని ఆయన చెప్పినట్టు పేర్కొన్నారు.


2019లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిలా, విజయమ్మల్లో ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే కడప ఎంపీ టికెట్ వస్తుందని దివంగత నేత వైఎస్ వివేకా చెప్పారని, ఈ విషయాన్ని వైఎస్ జగన్ తో కూడా మాట్లాడారని ఆయన చెప్పినట్టు కొమ్మా శివచంద్రారెడ్డి సీబీఐతో తెలిపారు. సింహాద్రిపురానికి చెందిన నాయకుడైన ఆయన.. ఈ స్టేట్ మెంట్ ను ఏప్రిల్ 26న సీబీఐకి ఇచ్చారు. ‘ఈనాడు’ కథనం ప్రకారం.. తాను వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరెడ్డిలతో కలిసి పార్టీలో పని చేయలకపోతున్నానని శివచంద్రారెడ్డి ఆ స్టేట్ మెంట్ లో తెలిపారు. అందుకే పార్టీ విడిచి పెట్టాలని అనుకున్నానని, ఈ నిర్ణయాన్ని వైఎస్ వివేకాకు చెప్పానని పేర్కొన్నారు. 

విషాదం.. నిద్రపోతున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. అస్వస్థతతో మృతి

Latest Videos

అయితే పార్టీని విడిచి వెళ్లకూదని వివేకా కోరినట్టు శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన తనను కొడుకు లాంటివాడినని అన్నారని, ఆయన తనకు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు వైఎస్ అవినాష్ కు ఎంపీ టికెట్ రాదని ఆయన చెప్పారని తెలిపారు. అవినాష్ కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పినట్టు పేర్కొన్నారు.

రైల్వే ట్రాక్‌పై తల్లి డ్యాన్స్.. కూతురు రీల్స్ రికార్డింగ్.. కట్ చేస్తే..

కాగా..  శివచంద్రారెడ్డి టీడీపీలో ఉన్న సమయంలోనే ఆయన స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేసింది. అయినా ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన మళ్లీ రికార్డు చేసింది. దీనిని సీబీఐ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ నేపథ్యంలో జరిగిన విచారణ సమయంలో తమ రహస్య సాక్షి అని పేర్కొంటూ హైకోర్టుకు నివేదించింది. ఈ స్టేట్ మెంట్  వల్ల అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం వైఎస్ వివేకా రెడ్డికి ఇష్టం లేదని తెలుస్తోందని సీబీఐ పేర్కొంది.

click me!