ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో బాంబు పెట్టానంటూ.. సీఎంకి మెసేజ్..

By telugu teamFirst Published Apr 25, 2019, 8:30 AM IST
Highlights

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో, బ్యాంకులో బాంబులు అమర్చారంటూ.. ఓ మహిళ ఏకంగా ముఖ్యమంత్రికి, ఓ మంత్రికి, పోలీసు అధికారులకు మెసేజ్ చేసింది. కాగా.. అది ఫేక్ అని తేలడంతో.. సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో, బ్యాంకులో బాంబులు అమర్చానంటూ.. ఓ మహిళ ఏకంగా ముఖ్యమంత్రికి, ఓ మంత్రికి, పోలీసు అధికారులకు మెసేజ్ చేసింది. కాగా.. అది ఫేక్ అని తేలడంతో.. సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని  సీతానగరం గ్రామానికి చెందిన  శ్రీరంజని(40) అనే మహిళ వెలుగు కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా.. ఇటీవల ఆమె గ్రామీన వికాస్ బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నించింది. అయితే.. ఇప్పటికే ఆమె పేరు మీద తీసుకున్న లోన్లు కట్టకుండా పెండింగ్ లో ఉండటంతో.. బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ ఆమెకు కొత్త లోన్  ఇవ్వడానికి అంగీకరించలేదు.

దీంతో.. లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేసింది.. అయితే ఆయన కుదరదు పోమ్మన్నాడు. దీంతో.. ఆమె అతనిపై పగ పెంచుకుంది. నీ సంగతి చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. అనంతరం ఆమె ఓ వ్యక్తి సిమ్ కార్డ్ ని దొంగతనం చేసి.. ఫేక్ ఐడీలతో ఓ ఫోన్ కొనుగోలు చేసింది.

 ఆన్ లైన్ లో సీఎం చంద్రబాబు, మంత్రి, టాప్ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లను సాధించింది. అనంతరం కొత్తగా కొన్న ఫోన్ లో సిమ్ వేసి.. సీఎం కి, మంత్రికి, పోలీసు అధికారులకు మెసేజ్ చేసింది.

తనకు లోన్ ఇవ్వని బ్యాంకు, పలు ఈవీఎంలు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లలో బాంబులు పెట్టానంటూ మెసేజ్ చేసింది. ఇటీవల శ్రీలంకలో వరస బాంబు పేలుళ్లు సంభవించిన క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో.. అది ఫేక్ అని తేలింది.

ఈ క్రమంలో.. ఫేక్ మెసేజ్ చేసిన ఆమెను.. ఫోన్ మెసేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేశారు. 

click me!