విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్‌లో 27 సంస్థలు: బిడ్డింగ్ కు సింగరేణి దూరం

By narsimha lodeFirst Published Apr 20, 2023, 4:11 PM IST
Highlights

విశాఖపట్టణం స్టీల్  ప్లాంట్   ఈఓఐ  బిడ్డింగ్  కు సమయం ముగిసింది.  27 సంస్థలు   ఈ బిడ్డింగ్ లో  పాల్గొన్నాయి. 

విశాఖపట్టణం: విశాఖ స్టీల్  ప్లాంట్  ఈఓఐ  బిడ్డింగ్ కు   గడువు  ముగిసింది.  మొత్తం  29  సంస్థలు  బిడ్డింగ్ లో పాల్గొన్నాయి.  ఈ బిడ్డింగ్ లో  ఆరు విదేశీ  కంపెనీలు , 21 స్వదేశీ కంపెనీలు  పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ నెల  15వ తేదీతో  బిడ్డింగ్ కు సమయం ముగిసింది.  కానీ  ఐదు రోజుల పాటు  ఈ గడువును  పొడిగించాలని  అందిన  వినతి మేరకు  ఈ నెల  20వ తేదీ వరకు  బిడ్డింగ్  ను  పొడిగించారు.  

విశాఖ స్టీల్  ప్లాంట్ ఈఓఐ లో పాల్గొనేందుకు  తెలంగాణలోని  సింగరేణి సంస్థ  ఆసక్తి  చూపింది.  అయితే  ఈ బిడ్డింగ్ లో  సింగరేణి సంస్థ  పాల్గొనలేదని  కార్మిక సంఘాలు  చెబుతున్నాయి. మరో వైపు  సీబీఐ మాజీ జేడీ  లక్ష్మినారాయణ  తరపు సంస్థ  ఈ బిడ్డింగ్ లో  పాల్గొంది.  విశాఖ స్టీల్ ప్లాంట్ లో  మూడో బ్లాస్ట్  ఫర్నేస్  నిర్వహణ కోసం  రూ. 5 వేల కోట్లు సమీకరించుకొనేందుకు  ఈఓఐను  ఆహ్వానించింది  ఆర్ఐఎన్ఎల్. 

Also read:విశాఖ స్టీల్ ప్లాంట్ .. అదంతా తప్పుడు ప్రచారం, ప్రైవేటీకరణపై తగ్గేదే లే : బాంబు పేల్చిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్  ను పూర్తి స్థాయిలో  నడపడం  కోసం  యాజమాన్యం  కసరత్తు  చేస్తుంది. ఈ క్రమంలోనే  అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని  విశాఖ స్టీల్ ప్లాంట్  యాజమాన్యం తలపెట్టింది.  ఇందులో భాగంగానే ఈఓఐను  ఆహ్వానించింది.  ఈఓఐలో  పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ,  రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు  ఉన్న సంస్థలు  పాల్గొనే అవకాశం లేదని  గతంలోనే  కేంద్రం నుండి  స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.

 ఈ కారణం చేత  సింగరేణి  సంస్థ బిడ్డింగ్ కు డూరంగా  ఉందా ఇంకా ఏ రకమైన  కారణాలున్నాయనే  విషయమై  స్పష్టత రావాల్సి ఉంది.  విశాఖ స్టీల్ ప్లాంట్  లో  పలువురు అధికారులతో  నాలుగైదు రోజుల పాటు  సింగరేణి  సంస్థ  ప్రతినిధులు  చర్చలు  నిర్వహించారు.  సింగరేణి సంస్థ  బిడ్డింగ్ లో  పాల్గొనేందుకు ఆసక్తి చూపడాన్ని  కార్మిక సంఘాలు  కూడా  ఆహ్వానించాయి. 

విశాఖ స్టీల్ ప్లాంట్  విషయమై బీఆర్ఎస్ నేతలు  బీజేపీ,  వైసీపీ, టీడీపీపై  విమర్శలు గుప్పతించాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణపై  ముందుకు వెళ్లబోమని  కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్  ప్రకటన  తమ విజయంగా  బీఆర్ఎస్  నేతలు  ప్రకటించారు. విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణ  విషయంలో  వెనక్కు వెళ్లే అవకాశం లేదని  కేద్రం తేల్చి  చెప్పింది.  ప్రైవేటీకరణకే కట్టుబడి  ఉన్నామని  కేంద్రం స్పష్టం చేసింది

click me!