జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం... కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

Published : Apr 20, 2023, 04:01 PM IST
జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం... కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జగనన్న భూహక్కు - భూరక్ష పథకంపై మంత్రుల సబ్ కమిటీ అధికారులతో భేటీ అయ్యింది. 

అమరావతి:జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలుపై చర్చించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. ఇందులో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు అధికారులు చేపట్టిన చర్యలపై మంత్రులు సమీక్షించారు. ఈ పథకం అమలుపై మంత్రుల కమిటీకి అధికారులు వివరాలను తెలియచేశారు.

జగనన్న భూహక్కు-భూరక్ష పథకాన్ని వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రులు అన్నారు. తొలి దశలో భాగంగా మే 20 లోగా 2వేల గ్రామాల్లో   సర్వే పూర్తి చేయాలని సీఎం  జగన్ ఆదేశించారని... ఆ మేరకు అధికారులు పనిచేయాలని మంత్రులు సూచించారు. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డులపై వివాదాలను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ అధికారులకు సూచించింది. 

మొదటిదశలో భాగంగా 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. 1,94,571 భూహక్కు పత్రాలను ఇప్పటికే సిద్దం చేయగా ఈకెవైసి ద్వారా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూవివాదాలకు ఆస్కారం లేకుండా భూయజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.  

Read More  చంద్రబాబు‌కు వైసీపీ ఎంపీ బర్త్ డే విషెస్.. నెటిజన్ల ప్రశ్నలు.. జగన్ చేసిన ట్వీట్‌తోనే కౌంటర్..

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని... అర్భన్ ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 యుఎల్బిల్లో 15 లక్షల ఎకరాలకు సర్వే చేయాల్సి ఉందని అన్నారు. అర్బన్ ఏరియాలోనే 5.5 లక్షల ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉందని... మిగిలిన 9.44 లక్షల ఎకరాలు అర్బన్ ఏరియా కింద ఉందని అన్నారు. ఈ మొత్తం ఏరియాలో 38.19 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉందని... దీనిని కూడా నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు కోరారు.  

మొదటి దశలో గుర్తించిన 12వేల గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియలో 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తయ్యిందని... 7158 గ్రామాల్లో డ్రోన్ ఇమేజ్ లను తీసుకున్నామని... 3758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేశామని అధికారులు వివరించారు. అలాగే 2611 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందని.... తుది దశ కోసం 2391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన కూడా పూర్తయ్యిందని తెలిపారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండేందుకు ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని... దీనిలో భాగంగా 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని... ఇప్పటి వరకు 86 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ ఫ్లై పూర్తి చేశామని వివరించారు.

సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో భూ సరిహద్దులను గుర్తించేందుకు ఇప్పటి వరకు 25.8 లక్షల సర్వే రాళ్ళు సిద్దంగా ఉన్నాయని మైనింగ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే 18.9 లక్షల సర్వే రాళ్ళను సరఫరా చేశామని... మరో 12.3 లక్షల రాళ్ళు ఆయా గ్రామాలకు తరలించడానికి సిద్దంగా ఉన్నాయని వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్ళను సిద్దం చేస్తున్నామని తెలిపారు. మే 20వ తేదీ లోగా సర్వే పూర్తయ్యిన గ్రామాల్లో రాళ్ళను పాతే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. 

ఆర్భన్ ప్రాంతాల్లో సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు 30.11 లక్షల ప్రాపర్టీలను వెరిఫై చేశామని... దానిలో 36.32 లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. ఇప్పటి వరకు యుఎల్బీ సరిహద్దులను అన్నింటినీ మ్యాన్ వల్ గా గుర్తించామని... అందుబాటులో ఉన్న మున్సిపల్ రికార్డులను ఆధారం చేసుకుని పిఓఎల్ఆర్ నివేదికను సిద్దం చేసుకున్నామని తెలిపారు. అర్బన్ ఏరియాల్లో సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లోనూ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని మంత్రుల కమిటీకి అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu