పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు

Published : Mar 10, 2024, 08:49 PM ISTUpdated : Mar 10, 2024, 08:52 PM IST
పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు

సారాంశం

విశాఖ-రాయగడ ప్యాసింజర్ పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ట్రాక్ మార్చే క్రమంలో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు.

విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలుకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ రైతులు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదమే తప్పినట్లైంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన కొంత సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ -రాయగడ ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం స్టేషన్ నుంచి బయలుదేరింది. అది విజయనగరం జిల్లా కొత్త వలస వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది. ట్రాక్ మార్చే క్రమంలో పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. అయితే లోకో పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu