
మచిలీపట్నం రాజకీయాలు :
మచిలీపట్నం అసెంబ్లీలో టిడిపి, వైసిపి సమఉజ్జీలుగా వున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓసారి టిడిపి, మరోసారి వైసిపి విజయం సాధించాయి. అయితే 2014 లో ఇక్కడినుండి గెలిచిన కొల్లు రవీంద్రకు చంద్రబాబు మంత్రివర్గంలో, 2019 లో గెలిచిన పేర్ని నానికి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిపదవి దక్కింది. ఇలా మచిలీపట్నం అసెంబ్లీపై ఈసారి అటు టిడిపి, ఇటు వైసిపి ఫోకస్ పెట్టడంతో ప్రజలు ఎవరివైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. మచిలీపట్నం
మచిలీపట్నం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,84,578
పురుషులు - 90,110
మహిళలు - 94,351
మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తిని వైసిపి పోటీలో నిలిపింది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మరోసారి మచిలీపట్నం నుండి పోటీలో నిలిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడినా రవీంద్రపై నమ్మకంతో మరో అవకాశం ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.
మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,47,180 (79 శాతం)
వైసిపి - పేర్ని నాని (వెంకటరామయ్య) - 66,141 (44 శాతం) - 5,932 ఓట్లతేడాతో విజయం
టిడిపి - కొల్లు రవీంద్ర - 62,232 (40 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - బండి రామకృష్ణ - 18,807 (12 శాతం) - ఓటమి
మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
టిడిపి - కొల్లు రవీంద్ర - 75,209 (53శాతం) - 15,806 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - పేర్ని నాని - 59,403 (42 శాతం) - ఓటమి