పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

Published : Mar 10, 2024, 07:34 PM IST
పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

సారాంశం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2008లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  పెడన అసెంబ్లీ ఏర్పడింది. అప్పటినుండి మూడుసార్లు పెడనలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా రెండుసార్లు జోగి రమేష్ గెలిచారు. ప్రస్తుతం ఆయన వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా పెడనలో మంచి ట్రాక్ రికార్డ్ వున్నప్పటికి జోగి రమేష్ ను వైసిపి అధిష్టానం పక్కనబెట్టింది... టిడిపి మాత్రం గత ఎన్నికల్లో ఓడినా కాగిత కృష్ణప్రసాద్ నే మరోసారి బరిలోకి దింపుతోంది. 

పెడన రాజకీయాలు : 

పెడన నియోజకవర్గంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పెడన మొదటి ఎమ్మెల్యే జోగి రమేష్. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయా పరిణామాలతో జోగి రమేష్ వైసిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున పెడన నుండి పోటీచేసి మరోసారి విజయం సాధించారు. 2014 లో మాత్రం టిడిపి అభ్యర్థి కాగిత వెంకట్రావు గెలుపొందారు.  ఇలా రాష్ట్ర విభజన తర్వాత పెడనలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చేరోసారి విజయం సాధించి టిడిపి, వైసిపి సమ ఉజ్జీలుగా నిలిచాయి.   
 
పెడన నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. గూడూరు 
2. బంటుమిల్లి
3. పెడన 
4. కృతివెన్న

పెడన అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  1,66,223

పురుషులు -  82,800
మహిళలు ‌- 83,414

పెడన అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నుండి ఉప్పాల రాము బరిలోకి దిగుతున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ ను మరోచోటికి మార్చి రాముకు పెడన సీటు ఇచ్చింది వైసిపి అధిష్టానం.  

టిడిపి అభ్యర్థి : 

2014 ఎన్నికల్లో పెడన సీటును గెల్చుకున్న కాగిత వెంకట్రావు తనయుడే కాగిత కృష్ణప్రసాద్. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినప్పటికీ కృష్ణప్రసాద్ నే 2024 ఎన్నికల బరిలోకి దింపుతోంది టిడిపి.  

 
పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

పెడన అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 1,45,848 (87 శాతం)

వైసిపి - జోగి రమేష్ - 61,920 (42 శాతం) - 7,839 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - కాగిత కృష్ణప్రసాద్ - 54,081 (37 శాతం) -  ఓటమి 

జనసేన పార్టీ - లక్ష్మీ శ్రీనివాస్ - 25,733 (17 శాతం) - ఓటమి 


పెడన అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 1,35,442 (88 శాతం)

టిడిపి - కాగిత వెంకట్ రావు- 71,779 (53శాతం) - 13,694 ఓట్ల మెజారిటీతో విజయం 
 
వైసిపి - బూరగడ్డ వేదవ్యాస్ - 58,085 (42 శాతం) - ఓటమి 

 

  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!