Train Accident: "ప్రాణం ఇంత సులువుగా పోతుందా.."

Published : Nov 01, 2023, 08:49 PM ISTUpdated : Nov 01, 2023, 08:54 PM IST
Train Accident: "ప్రాణం ఇంత సులువుగా పోతుందా.."

సారాంశం

AP Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండి దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. సుమారు 50 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వైరల్ గా మారాయి. మృత దేహాలు, బాధిత కుటుంబ సభ్యుల కన్నీటి వ్యథలు, క్షత్రగాత్రులు ఆర్తానాథాలు ఇలా ఎన్నో దృశ్యాలు తారసపడ్డాయి.  తాజాగా ఈ ప్రమాద బాధితుడైన ఓ జర్నలిస్ట్ సోదరిడ్ని ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

AP Train Accident: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండి వద్ద రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ   ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. సుమారు 50 మందికి తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనకు దర్యాప్తు చేసి, పూర్తి స్తాయిలో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశించింది.

ఈ తరుణంలో ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మృత దేహాలు, బాధిత కుటుంబ సభ్యుల కన్నీటి వ్యథలు, క్షత్రగాత్రులు ఆర్తానాథాలు ఇలా ఎన్నో దృశ్యాలు ప్రత్యేక్షమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రముఖ జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ తన ఆత్మీయ సోదరుడ్ని కోల్పోయాడు. అతడు భావోద్వేగంతో చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. 

ప్రముఖ జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ ఇలా తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు.'రైలు ప్రమాదం మా అన్నను దూరం చేసింది.మరణం ఇంత భయంకరంగా ఉంటుందా ? ప్రాణం ఇంత సులువుగా పోతుందా ? మన మధ్యలో ఉండే వ్యక్తి ఒక్కసారిగా లేకుండా పోతాడా ? సరే...మరణించాక ఆ లోటు ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో కదా... ఎన్ని జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందో కదా.. జీవితం ఒక్కసారిగా చీకటిగా మారిపోతుంది కదా..' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 

'రాత్రి సరిగా 1.50 నిముషాలకు ఫోన్ మోగింది. నిద్రలో ఉండి స్పందించలేదు. రెండు నిముషాల వ్యవధిలో మరోసారి ఫోన్ మోగింది. భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాను. గుండె పగిలే వార్త, పెద్దమ్మ కొడుకు శ్రీనన్న రైలు ప్రమాదంలో చనిపోయాడని ఏడుస్తూ తమ్ముడు మోహన్ చెబుతుంటే గుండె కొట్టుకోవడం ఆగినంత పనైంది. శీనన్న అన్న మాత్రమే కాదు. వారి కుటుంబానికి నాన్న. చిన్నతనంలోనే తండ్రి పోతే ఏడుగురున్న ఆ కుటుంబానికి నాన్నఅయ్యాడు.  అన్నీ తానై చెళ్లెల్లిద్దరికీ పెళ్లి చేశాడు. వాళ్లమ్మకు అనునిత్యం అండగా నిలుస్తున్నాడు. తమ్ముళ్లకు ఓ దారికి తెచ్చేందుకు శతవిలా సాయపడుతూ వస్తున్నాడు. తన భార్య మానసిక సమస్యతో మంచాన పడితే.. ఆమెకూ తల్లిలా గత ఇరవై ఏళ్లుగా సేవలు చేస్తున్నాడు' అంటూ తన ఎదలో ఉన్న బాధను వ్యక్తపరిచారు.

'తన అన్న కష్టాలు, బాధ్యతలే తప్ప సుఖం అంటూ ఎరుగని వ్యక్తి. గుండంత భారాన్ని మౌనంగా నెట్టుకొస్తున్నాడు. అన్న పిల్లల గురించి తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు. అత్యంత దుర్మార్గమైన విషయమేమంటే... తనకు జీవితాన్ని ఇచ్చింది రైల్వే శాఖ. అతను రైల్వేలో గార్డుగా పని చేస్తున్నాడు. విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో విధి నిర్వహనలోనే ప్రాణాలు వదిలాడు. ఇన్నాళ్లూ ఆ కుటుంబంలో అంతమందికి జీవితాన్నిచ్చిన ఉద్యోగమే. ఈరోజు ఆ ఉద్యోగమే తన ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. మిస్ యూ శీనన్న' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu