వాషింగ్ మెషీన్లలో రూ. 1.3 కోట్ల నగదు: స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు

By narsimha lode  |  First Published Oct 25, 2023, 10:00 AM IST

విశాఖపట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద  రూ. 1.3 కోట్ల నగదును  పోలీసులు సీజ్ చేశారు.  ఈ నగదుకు  ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు చెబుతున్నారు.


విశాఖపట్టణం: నగరంలోని  ఎన్ఏడీ జంక్షన్ వద్ద బుధవారంనాడు తెల్లవారుజామున  రూ. 1.3 కోట్ల నగదును  పోలీసులు సీజ్ చేశారు.  ఈ నగదును హవాలా నగదుగా పోలీసులు భావిస్తున్నారు. వాషింగ్ మెషీన్లలో  నగదును  తరలిస్తుండగా  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం నుండి విజయవాడకు   వాషింగ్ మెషీన్లను  ఆటోలో తరలిస్తున్నారు.  అయితే  ఎవరికి అనుమానం రాకుండా వాషింగ్ మెషిన్లలో  నగదును  తరలిస్తున్నారు. 

 అయితే  వాషింగ్ మెషీన్లలోని తరలిస్తున్న నగదుకు  ఎలాంటి  పత్రాలు లేవు. దీంతో  ఈ నగదును హవాలా నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ నగదును  ఎవరు తరలిస్తున్నారనే విషయమై  పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Latest Videos

undefined

గతంలో కూడ విశాఖపట్టణంలో  హవాలా నగదును పోలీసులు సీజ్ చేసిన  ఘటనలు నమోదయ్యాయి. విశాఖనగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి నుండి రూ. 70 లక్షలను  పోలీసులు సీజ్ చేశారు.ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.ఈ ఘటన 2021 జనవరి 11న చోటు చేసుకుంది. ఈ నగదు తరలింపుతో సంబంధం ఉన్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  శ్రీనివాస్, రోషన్ కుమార్ జైన్ లను  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

విశాఖపట్టణంలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  మూడు కోట్ల నగదును తరలిస్తున్న వ్యక్తిని  పోలీసులు 2022  మే 18న అరెస్ట్ చేశారు.బి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ నగదును తరలిస్తున్న విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు  శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.తణుకులో మరో వ్యక్తికి ఈ నగదును  తరలించే సమయంలో పోలీసులు వలవేసి  పట్టుకున్నారు.షెల్ కంపెనీల ద్వారా రూ. 570 కోట్లను తరలించిన తొమ్మిది మందిపై  విశాఖపట్టణం పోలీసులు 2017  మే 13న కేసు నమోదు చేశారు.

also read:హైద్రాబాద్‌లో పోలీసుల తనిఖీలు: కవాడీగూడ,వనస్థలిపురంలో రూ. 3 కోట్లకు పైగా హవాలా నగదు సీజ్

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.  ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  పోలీసులు పెద్ద ఎత్తున  తనిఖీలు చేపట్టారు. దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా  లెక్క చూపని నగదును సీజ్ చేసుకున్నారు.  సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేస్తున్నారు.  రూ.50వేల కంటే ఎక్కువ నగదును తరలించే సమయంలో ఇందుకు తగిన పత్రాలను  తమ వద్ద ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

click me!