విశాఖపట్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 07, 2024, 06:32 PM ISTUpdated : Mar 07, 2024, 06:34 PM IST
విశాఖపట్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

విశాఖ అంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్.. ఎవరి అంచనాలు వారివి.. ఎవరి వ్యూహాలు వారివి. దేశంలో అత్యధిక మంది అర్బన్ ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గం విశాఖపట్నం. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా వున్న విశాఖలో దేశంలోని అన్ని రాష్ట్రాల వారు స్థిరపడ్డారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లు ఎక్కువగా ఉద్యోగ, వ్యాపార వర్గాల వారే. వీరిలోనూ ఉత్తరాది వారి హవా కనిపిస్తుంది. లోకల్ , నాన్ లోకల్ అనే తేడా లేకుండా అందరినీ ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 1998 నుంచి నేటి వరకు విశాఖలో ఎంపీలుగా గెలిచినవారంతా స్థానికేతరులే కావడం గమనార్హం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం , మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు.

విశాఖపట్నం.. దేశంలో ఈ నగరం పేరు తెలియని వారుండరు. అందమైన  , ప్రశాంతమైన నగరంగా విశాఖకు గుర్తింపు వుంది. ఓ వైపు సాగర తీరం, మరోవైపు పచ్చని కొండలకు నెలవు విశాఖ. రాజకీయంగా, పారిశ్రామికంగా, సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా వైజాగ్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తెలుగు నాట కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైజాగ్. తెలుగువారిని కాకుండా దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటూ దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖపట్నం ఖ్యాతినార్జించింది. 

విశాఖపట్నం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. పూర్తిగా అర్బన్ ఓటర్లే :

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా విశాఖ అవతరించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన మూడు రాజధానుల విధానంలో భాగంగా వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి విశాఖ రాజకీయం పూర్తిగా మారిపోయింది. విశాఖ అంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్.. ఎవరి అంచనాలు వారివి.. ఎవరి వ్యూహాలు వారివి.

దేశంలో అత్యధిక మంది అర్బన్ ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గం విశాఖపట్నం. నౌకాశ్రయంతో పాటు తూర్పు నావల్ కమాండ్‌కు హెడ్ క్వార్టర్స్‌గా నగరం సేవలందిస్తోంది. వీటితో పాటు అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా వున్న విశాఖలో దేశంలోని అన్ని రాష్ట్రాల వారు స్థిరపడ్డారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లు ఎక్కువగా ఉద్యోగ, వ్యాపార వర్గాల వారే. వీరిలోనూ ఉత్తరాది వారి హవా కనిపిస్తుంది. 

విశాఖపట్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024.. పూసపాటి వంశీయులకు కంచుకోట :

గవర, యాదవ, కమ్మ , కాపు, వెలమ, క్షత్రియ సామాజికవర్గాలు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్లు 18,29,300 మంది ఓటర్లుండగా.. వీరిలో పురుషులు 9,11,063 మంది.. మహిళలు 9,18,121 మంది వున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం , మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. గజపతి రాజులు, పారిశ్రామికవేత్తలతో పాటు ఎందరో ప్రముఖులు విశాఖ ఎంపీగా గెలిచారు. లోకల్ , నాన్ లోకల్ అనే తేడా లేకుండా అందరినీ ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 1998 నుంచి నేటి వరకు విశాఖలో ఎంపీలుగా గెలిచినవారంతా స్థానికేతరులే కావడం గమనార్హం. 

1952లో ఏర్పడిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 11 సార్లు , టీడీపీ 3 సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, బీజేపీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శృంగవరపుకోట, భీమిలీ, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, గాజువాక అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో నాలుగు టీడీపీ గెలవగా.. 3 చోట్ల వైసీపీ నెగ్గింది.

తెలుగుదేశం గెలిచిన నాలుగు స్థానాలు విశాఖ నగరంలోనివి కావడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి భరత్ మెతుకుమిల్లికి 4,32,492 ఓట్లు.. జనసేన అభ్యర్ధి వీవీ లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి దగ్గుబాటి పురంధేశ్వరికి 33,892 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 4,414 ఓట్ల తేడాతో విశాఖలో జెండా పాతింది. 

విశాఖపట్నం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈసారి టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి జగన్ అవకాశం కల్పించారు. కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో పాటు స్థానికంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు వుండటంతో ఝాన్సీని వైసీపీ బరిలో దించింది. టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ మరోసారి పోటీకి సై అంటున్నారు.

జనంలో తిరుగుతూ ఈసారి ఎలాగైనా ఎంపీగా గెలవాలని నిర్ణయించుకున్నారు. 1999 తర్వాత టీడీపీ ఇప్పటి వరకు విశాఖలో గెలిచింది లేదు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఈ సీటును కేటాయిస్తోంది తెలుగుదేశం. కానీ ఈసారి మాత్రం బీజేపీతో పొత్తున్నా సరే.. విశాఖను వదులుకోకూడదని తెలుగుదేశం భావిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈసారి సొంతంగా పార్టీ పెట్టి.. విశాఖ ఎంపీ బరిలో నిలిచారు. ఆయనకు యువత, మేధావులు, సంపన్న వర్గంలో మంచి ఫాలోయింగ్ వుంది. మరి వీరిలో విశాఖను ఎవరు కైవసం చేసుకుంటారో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే