అమలాపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 07, 2024, 03:47 PM ISTUpdated : Mar 07, 2024, 05:03 PM IST
అమలాపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

అమలాపురం దేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా వున్న మూడో పార్లమెంట్ నియోజకవర్గం. అంతేకాదు.. ఈ సెగ్మెంట్ పరిధిలో 3 ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగిని అందించిన ఘనత అమలాపురానిదే. బయ్యా సూర్యనారాయణమూర్తి, కుసుమ కృష్ణమూర్తి, పీవీజీ రాజు వంటి నేతలను పార్లమెంట్‌కు పంపిన ఘనత అమలాపురానిదే. అమలాపురం లోక్‌సభ పరిధిలో రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోల్, గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

అమలాపురం .. ఈ పేరు వినగానే కొబ్బరి చెట్లు, అందమైన పల్లెటూర్లు, గోదావరి గలలు గుర్తొస్తాయి. ప్రకృతి అందానికి నెలవైన ఈ ప్రాంతం ఎంత పచ్చగా కనిపిస్తుందో, అక్కడి రాజకీయం అంతకుమించిన రచ్చతో వుంటుంది. అమలాపురం దేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా వున్న మూడో పార్లమెంట్ నియోజకవర్గం. అంతేకాదు.. ఈ సెగ్మెంట్ పరిధిలో 3 ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగిని అందించిన ఘనత అమలాపురానిదే. ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. కోనసీమ దేశంలోని అత్యంత సారవంతమైన భూములున్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ పండని పంటలంటూ లేవు. 

అమలాపురం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఎస్సీ  ఓటర్ల ప్రాబల్యం :

ఒకప్పుడు జనరల్ నియోజకవర్గంగా, ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా అమలాపురం మారింది. బయ్యా సూర్యనారాయణమూర్తి, కుసుమ కృష్ణమూర్తి, పీవీజీ రాజు వంటి నేతలను పార్లమెంట్‌కు పంపిన ఘనత అమలాపురానిదే. 1957లో అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 6 సార్లు, సీపీఐ , వైసీపీలు ఒక్కోసారి గెలిచాయి. అమలాపురం లోక్‌సభ పరిధిలో రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోల్, గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు, మండపేట తప్పించి మిగిలిన 5 చోట్లా వైసీపీ విజయం సాధించింది. 

2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి అమలాపురంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,59,556 మంది. వీరిలో పురుష ఓటర్లు 7,30,171 మంది.. మహిళా ఓటర్లు 7,29,356 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చింతా అనూరాధకు 4,85,313 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్‌కు 4,45,347 ఓట్లు.. జనసేన అభ్యర్ధి డీఎంఆర్ శేఖర్‌కు 2,54,848 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ 39,966 ఓట్ల మెజారిటీతో అమలాపురాన్ని కైవసం చేసుకుంది. 

అమలాపురం (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. ఏ పార్టీలోనూ ఖరారు కాని అభ్యర్ధులు :

వైసీపీ విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధ నిత్యం ప్రజల్లో వుంటున్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారన్న పేరుంది. ఈసారి కూడా ఆమె ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే మంత్రి విశ్వరూప్‌‌తో అనూరాధకు అంతర్గత విభేదాలున్నాయి. లేనిపక్షంలో పి.గన్నవరం నుంచి ఆమెను బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించగా.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇక టీడీపీ విషయానికి వస్తే.. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీశ్ మాథూర్ మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. జనసేన టీడీపీ మధ్య పొత్తు వుండటంతో అమలాపురాన్ని జనసేన కోరే అవకాశం వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే