#JanaSenaLongMarch లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్

Published : Nov 03, 2019, 04:20 PM ISTUpdated : Nov 03, 2019, 04:53 PM IST
#JanaSenaLongMarch లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్

సారాంశం

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు,  పాల్గొన్నారు.మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. 

అంతకు ముందు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమయ్యే లాంగ్ మార్చ్.. రామాటాకీస్, ఆసీలుమెట్ట ప్రాంతాల మీదుగా మహిళా కళాశాల వద్దకు చేరుకుంటుంది. అనంతనం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.

Also Read:టీడీపీకి గుడ్‌బై: వైసీపీలోకి వల్లభనేని వంశీ?

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ కూడ పాల్గొంటుంది.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు భవన నిర్మాణకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దీంతో భవన నిర్మాణకార్మికుల పనులు కల్పించేలా ఇసుక కొరతను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ చేసేది లాంగ్ మార్చ్ కాదని.. అది రాంగ్ మార్చ్ అని సెటైర్లు వేశారు. జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఉన్నారని.. ఆయన పూర్తిగా ప్రతిపక్షనేత కంట్రోల్‌లోకి వెళ్లిపోయారని తెలిపారు.

Also Read:విశాఖ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేయండి: పవన్ కళ్యాణ్ పిలుపు

ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కలిసి తెర వెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పుడు బహిరంగంగానే కలిసి రాజకీయాలు చేస్తున్నారని అవంతి దుయ్యబట్టారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్ లేదని విమర్శించారు.

అందువల్ల చంద్రబాబు నాయుడు.. పవన్‌ని టీడీపీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. తెలుగుదేం హయాంలో ఎమ్మెల్యే వనజాక్షిపై దాడి చేస్తే స్పందించని పవన్ కల్యాణ్ ఇప్పుడు రోడ్డెక్కడం ఏంటని శ్రీనివాస్ నిలదీశారు.

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు