#JanaSenaLongMarch విశాఖ చేరుకున్న పవన్: మరికొద్దిసేపట్లో లాంగ్‌మార్చ్

Published : Nov 03, 2019, 03:50 PM ISTUpdated : Nov 03, 2019, 03:52 PM IST
#JanaSenaLongMarch విశాఖ చేరుకున్న పవన్: మరికొద్దిసేపట్లో లాంగ్‌మార్చ్

సారాంశం

లాంగ్‌మార్చ్‌లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

లాంగ్‌మార్చ్‌లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమయ్యే లాంగ్ మార్చ్.. రామాటాకీస్, ఆసీలుమెట్ట ప్రాంతాల మీదుగా మహిళా కళాశాల వద్దకు చేరుకుంటుంది. అనంతనం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.

Also Read:విశాఖ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేయండి: పవన్ కళ్యాణ్ పిలుపు

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ కూడ పాల్గొంటుంది.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు భవన నిర్మాణకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దీంతో భవన నిర్మాణకార్మికుల పనులు కల్పించేలా ఇసుక కొరతను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.

Also Read:''చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''

శనివారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్ కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ పవన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  తమ సమస్యపై అన్ని పక్షాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు విన్నవించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

"మంగళగిరి పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలతో కలసి నిరసన చేపట్టాలని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు లాంగ్ మార్చ్ కు అన్ని పక్షాలను ఆహ్వానించాం. సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. 

లాంగ్ మార్చ్ కి  విశాఖలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకుల అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి మీకు అండగా నిలిచాను.  

ఇది 35 లక్షల మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల సమస్య. వారి సమస్య ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరే ఎక్కువ అర్ధం చేసుకోగలరు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియపర్చేందుకు ఆలంబనగా నిలవాలని కోరుతున్నాం" అని పవన్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్