Visakha Crime: డంబెల్ తో భార్య తలను చితక్కొట్టి... ఉరేసుకుని భర్త ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Dec 16, 2021, 10:49 AM ISTUpdated : Dec 16, 2021, 11:06 AM IST
Visakha Crime: డంబెల్ తో భార్య తలను చితక్కొట్టి... ఉరేసుకుని భర్త ఆత్మహత్య

సారాంశం

భార్యను డంబెల్ తో బాది చంపిన భర్త చివరకు తానుకూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం: క్షణికావేశంలో కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా కొట్టిచంపాడో భర్త. ఆ తర్వాత అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలు ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన విషాదం విశాఖపట్నం జిల్లా (visakhapatnam district)లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోకి శ్రీహరిపురం గొల్లపాలెంలో మాధవి-శివనాగేశ్వర రావు దంపతులు నివాసముంటున్నారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగగా ఇటీవల కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు.  

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నాగేశ్వరరావు భార్య మాధవిపై దాడికి తెగబడ్డాడు. వ్యాయామం కోసం ఉపయోగించే డంబెల్ తో భార్య మాధవి తలపై కొట్టాడు నాగేశ్వరరావు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆమె రక్తపుమడుగులో పడి చనిపోయింది.   

read more  వివాహేతర సంబంధం : అతనికి 21, ఆమెకు 35.. కలిసి బతకలేమని.. అడవిలోకి వెళ్లి ఉరేసుకుని..

భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురయిన నాగేశ్వరరావు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా భార్యాభర్తలు ఇంట్లోనే శవాలుగా మారారు. 

దంపతుల మృతదేహాను గమనించినవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ కు తరలించారు. నాగేశ్వరరావు భార్య హత్యకు ఉపయోగించిన డంబెల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే కర్ణాటక (karnataka)లో ఓ మందుబాబు దారుణానికి ఒడిగట్టాడు. గుడికి వెలదామంటూ భార్యా బిడ్డలను బయటకు తీసుకెళ్లిన తాగుబోతు వారిని నదిలోకి తోసేసి హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే నదిలో కొట్టుకుపోతున్న చిన్నారులను జాలర్లు కాపాడగా మహిళ గల్లంతయ్యింది.  

నంజనగూడు తాలూకా కసువినహళ్లికి చెందిన దేవికి ముద్దహళ్లికి చెందిన రాజేష్ తో కొన్నేళ్ళ కిందటే వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే మద్యానికి బానిసైన రాజేష్ భార్యా పిల్లల ఆలనాపాలనా మరిచిపోయాడు. ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. దీంతో భార్యాపిల్లలపై ద్వేషాన్ని పెంచుకున్నాడు రాజేష్. 

read more  Guntur Bus Accident: కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు... ఐదుగురికి గాయాలు

ఈ క్రమంలోనే భార్యాపిల్లలను నమ్మించి గుడికి వెళదామని తీసుకెళి దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. సంజనగూడులోని ఓ గుడికి భార్యాపిల్లలను తీసుకెళ్లిన రాజేష్ ముందుగా కపిలా నదిలో స్నానం చేద్దామని తీసుకెళ్లాడు. నదీ తీరానికి చేరుకున్నాక భార్యను నీటిలోకి తోసేసాడు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ఆమె కొట్టుకుపోయింది. 

ఆ తర్వాత ఇద్దరు పిల్లలను కూడా నదిలోకి తోసేసాడు. ఈ విషయాన్ని గమనించిన జాలర్లు వెంటనే నీటిలోకి దూకి పిల్లలిద్దర్ని రక్షించారు. పసివాళ్లని కూడా చూడకుండా నీటిలోకి తోసిన ఆ కసాయి తండ్రిని బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే అంతకు ముందు భార్యను కూడా నదిలోకి తోసేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. దీంతో ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్