పీఆర్సీపై పీటముడి: నేడు ఉద్యోగ సంఘాలతో మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలు

By narsimha lode  |  First Published Dec 16, 2021, 10:36 AM IST

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం గురువారం నాడు మరోసారి చర్చలు జరపనుంది. ఫిట్‌మెంట్ తో పాటు మరికొన్ని డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు మెట్టు దిగడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.


అమరావతి: Prcపై ఉద్యోగ సంఘాలతో AP Government గురువారం నాడు కూడా చర్చలు జరపనుంది. బుధవారం నాడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాలతో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana rajendranath reddy, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు Sajjala Ramakrishna Reddy లు  చర్చించనున్నారు.21 ప్రధాన అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలతో  ప్రభుత్వం బుధవారం నాడు చర్చించింది. 21 ప్రధానమైన అంశాలపై  ఈ సమావేశంలో చర్చించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికను తాము అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. 

also read:AP PRC Report : తెగని పంచాయతీ.. పట్టు వీడని ఉద్యోగ సంఘాలు, రేపు మరోసారి భేటీ

Latest Videos

Chief Secretary నేతృత్వంలోని సెక్రటరీల కమిటీ  సిఫారసు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసింది. అయితే ఏపీ జేఏసీ, ఏపీ జేఎసీ అమరావతి నేతలు  55 శాతం prc fitment  ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం 34 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు మానిటరీ బెనిఫిట్స్ ను వచ్చే ఏడాది అక్టోబర్ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విషయమై కూడా ఉద్యోగ సంఘాల నేతలు పట్టు వీడడం లేదు.

పీఆర్సీ విషయమై ఇప్పటికే AP Jac, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ  సంఘాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వంతో చర్చలకు  నల్ల బాడ్జీలను ధరించి చర్చలకు హాజరయ్యారు. సీఎంతో జరిగే చర్చలకు కూడా తాము నల్లబాడ్జీలతో హాజరౌతామని కూడా ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అయితే సీఎంతో చర్చల సమయంలో  నల్లబాడ్జీలు లేకుండా రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కోరారు. అయితే తమ ఉద్యమ కార్యాచరణను వీడేదీ లేదని ఉద్యో సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
 

click me!