రియల్టర్ కిడ్నాప్ కేసు .. ఆర్ధిక వ్యవహారాలే కారణం, శ్రీనివాస్‌పై చీటింగ్ కేసులు : విశాఖ

By Siva Kodati  |  First Published Jun 29, 2023, 8:25 PM IST

ఆర్ధిక లావాదేవీలతోనే రియల్టర్ శ్రీనివాస్‌ దంపతులను కిడ్నాప్ చేశారని తెలిపారు విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ. శ్రీనివాస్‌పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలలో చీటింగ్ కేసులున్నాయని ఆయన పేర్కొన్నారు. 


విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారంపై నగర పోలీస్ కమీషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. పట్నాల శ్రీనివాస్ ఆయన భార్య లక్ష్మీని బ్రహ్మయ్య , సాయి నిఖిల్, మణికంఠ, ప్రదీప్ రెడ్డి‌లు కారులో అపహరించారని సీపీ వెల్లడించారు. ఈ ఆరుగురు కలిసి విజయవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు కాదని కమీషన్ ఏజెంట్లని ఆయన తెలిపారు. 

కిడ్నాప్‌కు గురైన శ్రీనివాస్ 2021లో రావుల పాలెంలో సత్య సౌధ సంస్ లో వాలంటీర్‌గా పని చేశాడని సీపీ చెప్పారు. రెండు నెలలు క్రితం అక్కయ్యపాలెంలో ఇల్లు తీసుకుని చరణ్ గ్రూప్‌లో కమిషన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని కమీషనర్ వెల్లడించారు. శ్రీనివాస్‌పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలలో చీటింగ్ కేసులున్నాయని సీపీ పేర్కొన్నారు. వీరి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీల వల్లే శ్రీనివాస్ ను, అతని భార్య లక్ష్మీని అహపరించారని కమీషనర్ తెలిపారు. యలమంచిలి దగ్గర శ్రీనివాస్ భార్య లక్ష్మీని విడిచిపెట్టారని.. ఆమె ఇచ్చిన సమాచారంతో కత్తి పూడి పోలీసులు నిందితులను పట్టుకున్నారని సీపీ పేర్కొన్నారు. 

Latest Videos

undefined

Also Read: విశాఖలో మరో కిడ్నాప్ కలకలం: రియల్టర్ శ్రీనివాస్ దంపతుల కిడ్నాప్

మరోవైపు నగరంలో వున్న గన్ లైసెన్సులపైనా త్రివిక్రమ వర్మ వివరాలు తెలిపారు. విశాఖలో మొత్తం 620 గన్ లైసెన్స్ ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి 2023 వరకు 15 మంది మాత్రమే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. 2020లోనే కలెక్టర్ ఆఫీస్ ద్వారా మంత్రి గుడివాడ అమర్నాథ్ దరఖాస్తు చేసుకున్నారని సీపీ తెలిపారు. ఇటీవలే  కిడ్నాప్‌కు గురైన ఎంపీ కుటుంబ సభ్యులు కూడా గన్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు.

ఇక గాజువాక విద్యార్థుల మిస్సింగ్ కేసుపైనా కమీషనర్ స్పందించారు. గాజువాకలో ఓ ప్రేవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్ అయినట్లు కేసు నమోదు అయిందన్నారు. తొలుత వారు అనకాపల్లి వెళ్లినట్లు గుర్తించామని త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. అనంతరం వారు వెరీజ్ మై ట్రాయిన్ యాప్ ద్వారా సమాచారం తెలుసుకొని హైదరాబాద్ వెళ్లారని, వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తించామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.    

click me!