కన్నా...మా అన్నే, ఏ పార్టీలో ఉంటారో తెలియదు: అంబటి సెటైర్లు

Published : Jun 29, 2023, 05:06 PM IST
 కన్నా...మా అన్నే, ఏ పార్టీలో  ఉంటారో తెలియదు: అంబటి సెటైర్లు

సారాంశం

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై  ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు  చేశారు.  ఎప్పుడు ఏ పార్టీలో  ఉంటారో తెలియదని  కన్నా లక్ష్మీనారాయణనుద్దేశించి  అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 

అమరావతి: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై  ఏపీ మంత్రి  అంబటి రాంబాబు  సెటైర్లు వేశారు.  ఎప్పుడూ ఏ పార్టీలో  ఉంటారో  కూడ  ఆయనకే తెలియదని  మంత్రి రాంబాబు ఎద్దేవా చేశారు.  కన్నా లక్ష్మీనారాయణ తనకు  అన్నే  అని ఆయన తెలిపారు. 

గురువారంనాడు సత్తెనపల్లిలో  మంత్రి అంబటి రాంబాబు  మీడియాతో మాట్లాడారు.  కన్నా లక్ష్మీనారాయణ మా అన్నే , తామిద్దరం గతంలో ఒకే  పార్టీలో పనిచేసినట్టుగా  అంబటి రాంబాబు  గుర్తు  చేశారు.  ఆయన ఎప్పుడు  ఎక్కడ ఉంటారో తెలియదన్నారు.తనకు  సవాల్ విసిరే నైతిక అర్హతే కన్నా లక్ష్మీనారాయణకు  లేదన్నారు.కన్నా లక్ష్మీనారాయణ  పార్టీలో  చేరిన వెంటనే తొలి నుండి టీడీపీలో  ఉన్నవారంతా  పార్టీనుండి వెళ్లిపోయారన్నారు.తనకు సెల్ఫీ ఛాలెంజ్  విసిరే  నైతిక అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదన్నారు. 

వంగవీటి రంగాను హత్య  చేసింది ఎవరో చెప్పాలని కోరారు.  నిన్ను కూడ  హత్య చేసేందుకు  ఎవరు ప్రయత్నించారో చెప్పాలన్నారు. చివరి వరకు  చంద్రన్న వెంటే  ఉంటావా ? పార్టీ ఫిరాయిస్తావా  అని  అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. 

సత్తెనపల్లిలో  చివరివరకు  ఉండి పోటీ చేస్తావా , మధ్యలోనే  వెళ్లిపోతావా అని  మంత్రి అంబటి రాంబాబు  కన్నా లక్ష్మీనారాయణకు  సవాల్  విసిరారు.తాను విసిరిన మూడు  ప్రశ్నలకు  సమాధానం చెప్పాలని  ఆయన  కన్నా లక్ష్మీనారాయణను  కోరారు.వైఎస్ఆర్  కేబినెట్ లో  కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా  పనిచేశారన్నారు.  అలాంటి  కన్నా లక్ష్మీనారాయణ  పచ్చకండువా  వేసుకొని  జైజై తెలుగుదేశం, జై చంద్రబాబు అనడం చూసి ఆశ్చర్యం వేస్తుందన్నారు.  ఎవరి కర్మ వారు అనుభవించకతప్పదని  కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి  మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

also read:సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ: పవన్ పై అంబటి ఫైర్

పోలవరం గైడ్ బండ్  కూలిపోవడంపై నిపుణుల బృందం పరిశీలించిందన్నారు. పోలవరం పై తప్పుడు  కథనాలు  రాస్తున్నారని  ఎల్లో మీడియాపై  మంత్రి  విమర్శలు  చేశారు. గైడ్ బండ్  పై  కేంద్ర ప్రభుత్వం  సీరియస్ అయిందనే  విషయంలో వాస్తవం లేదన్నారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్