జమ్మూలో బస్ యాక్సిడెంట్... 70 మంది వైజాగ్ కార్పోరేటర్లకు తప్పిన ప్రమాదం

By Arun Kumar PFirst Published Sep 15, 2023, 11:53 AM IST
Highlights

స్టడీ టూర్ పేరిట జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న విశాఖ కార్పోరేటర్లు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కార్పోరేటర్ల బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.  

జమ్మూ కాశ్మీర్ : విశాఖపట్నంకు చెందిన కార్పోరేటర్లకు పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం స్టడీ టూరులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న విశాఖ కార్పోరేటర్ల బస్సు ప్రమాదానికి గురయ్యింది. కాట్రా నుండి జమ్మూకు 70 మంది కార్పోరేటర్లతో వెళుతున్న బస్సు మరో బస్సును ఢీకొట్టి పుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుండి కార్పోరేటర్లంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. 

అయితే ప్రమాదానికి గురయిన కార్పోరేటర్ల బస్సు స్వల్పంగా దెబ్బతింది. దీంతో బస్సు రిపేర్ అనంతరం అదే బస్సులో విశాఖ కార్పోరేటర్లు జమ్మూకు చేరుకున్నారు. ప్రమాద వార్త తెలిసి కంగారుపడిపోయిన కార్పోరేటర్లు కుటుంబాలు వారి క్షేమ సమాచారం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.  

ఈ నెల 10న విశాఖపట్నం కార్పోరేటర్లు జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్ పర్యటనకు బయలుదేరారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ప్రజల జీవన విధానంను, పాలనను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే కాట్రా పట్టణంలోని వైష్ణో దేవి ఆలయాన్ని వీరు సందర్శించుకున్నారు. అక్కడినుండి జమ్మూకు వెళుతుండగా బస్సు యాక్సిడెంట్ జరిగింది. 

Read More  తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో ఘటన

ఇదిలావుంటే గతంలోనూ ఇలాగే స్టడీ టూర్ కోసం డిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన విశాఖ కార్పోరేటర్లు వరదల్లో చిక్కుకున్నారు.గతేడాది హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతం కులు మనాలి వెళ్ళిన విశాఖ కార్పోరేటర్లు అక్కడినుండి చండీఘడ్ వెళుతుండగా కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో కుటుంబసభ్యులో సహా కార్పోరేటర్లు ప్రయాణిస్తున్న వాహనం ఘాట్ రోడ్డులో చిక్కుకుపోయింది. అయితే ఈ ప్రమాదం నుండి కార్పోరేటర్లు  సురక్షితంగా బయటపడ్డారు. 

అయితే తాజాగా మరోసారి ఇలాగే స్టడీ టూర్ లో వుండగా విశాఖపట్నం కార్పోరేటర్లు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. కార్పోరేటర్లకు స్టడీ టూర్లు కలిసిరావడంలేదని విశాఖ ప్రజలు అంటున్నారు. 
 

click me!