విశాఖ హత్యలు: వాళ్లని కూడా అరెస్ట్ చేయాలి.. పోస్ట్‌మార్టానికి అంగీకరించని విజయ్

By Siva KodatiFirst Published Apr 16, 2021, 2:29 PM IST
Highlights

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో దారుణహత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పలరాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తానని విజయ్, అతని బంధువులు తేల్చిచెబుతున్నారు.

బత్తిన అప్పలరాజుతో పాటు దుర్గాప్రసాద్, గౌరీ, శీనులను కూడా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు పొరుగున నివసించే విజయ్ కుటుంబంతో పాతకక్షలు వున్నాయి .

దీంతో అదను చూసి విజయ్ కుటుంబంపై దాడి చేశాడు అప్పలరాజు. ఇంట్లో వున్న ఆరుగురిని కత్తితో నరికి చంపాడు. విజయ్ తండ్రి బొమ్మిడి రమణ, భార్య ఉషారాణి, రెండేళ్ల కొడుకు విజయ్, ఆరు నెలల కుమార్తె ఉర్విషను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు అప్పలరాజు.

Also Read:విశాఖ హత్యలు: పావు గంటలో ఆరుగుర్ని చంపేసి, ఆరగంట సేపు ఆమె శవం పక్కనే...

తన కుమార్తెతో విజయ్ ప్రేమ వ్యవహారం కారణంగానే అతని కుటుంబంలోని వారందరీని అప్పలరాజు హత్య చేసినట్లు తెలుస్తోంది. 2018తో విజయ్ తన కుమార్తెతో ఫోన్ చాటింగ్ చేసినట్లు అప్పలరాజు గుర్తించాడు.

దీంతో విజయ్‌పై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు అప్పలరాజు. ఈ క్రమంలోనే విజయ్ కుటుంబం మొత్తాన్ని హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 

click me!