ప్రధాని మోదీపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ప్రశంసలు

By Arun Kumar PFirst Published Nov 5, 2021, 12:57 PM IST
Highlights

కేదార్ నాథ్ ఆలయ అభివృద్దికి కృషిచేసి ప్రస్తుతం ప్రారంభోత్సవ కార్యాక్రమాలు చేపడుతున్న ప్రధాని మోదీపై విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసలు కురిపించారు. 

విశాఖపట్నం: ప్రతి ఇంట్లోనూ ఆదిశంకరాచార్యుల ఫోటో పెట్టుకుని ఆయన నామస్మరణ చేయాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. ప్రముఖ హిందూ దేవాలయం కేదార్ నాథ్ లో ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ క్రమంలో ప్రధాని చేతుల మీదుగా ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని స్వరూపానందేంద్ర అన్నారు.

కార్తిక మాసం ఆరంభం సందర్భంగా ఇవాళ(శుక్రవారం) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు.  వారిద్దరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఉపాలయమైన కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నక్షత్రవనాన్ని స్వామీజీలిద్దరు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా నెల రోజులు జరిగే కార్తీకమాస పూజలను పీఠాధిపతులు చేతులమీదుగా ప్రారంభించారు. కార్తీక మాసం తొలిరోజున ఇష్టదైవం సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు స్వరూపానందేంద్ర సరస్వతి. 

వీడియో

ఇదిలావుంటే నాడు ఉత్తరాఖండ్‌లోని  Kedarnath temple ను ప్రధాని మోదీ సందర్శించారు. ఇవాళఉదయం కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకొన్న ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆది శంకరాచార్య సమాధిని narendra modi ప్రారంబించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... 2013 వరదల తర్వాత కేదార్‌నాథ్ ను తిరిగి అభివృద్ది చేయవచ్చా అని ప్రజలు ఆలోచించారని.... కానీ మళ్లీ అభివృద్ది చెందుతుందని తనలోని ఒక స్వరం ఎప్పుడూ చెబుతుందని పేర్కొన్నారు. 

read more  Yadadri Temple : కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు.. స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కితాబు.. (వీడియో)

తాను క్రమం తప్పకుండా కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్టుగా ప్రధాని గుర్తు చేశారు. డ్రోన్ పుటేజీ ద్వారా ఇక్కడ జరుగుతున్న పలు పనుల పురోగతిని సమీక్షించానన్నారు. ఈ పనులకు మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు  చెబుతున్నట్టుగా మోడీ  ప్రకటించారు

.ఆది శంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.కేదార్‌నాథ్ ను సందర్శించే ప్రతి ఒక్కరూ తమతో పాటు కొత్త స్పూర్తిని పొందుతారన్నారు మోడీ.భారతీయ తత్వశాస్త్రం, మానవ సంక్షేమం గురించి మాట్లాడుతుంది. జీవితాన్ని సమగ్ర పద్దతిలో చూస్తోందన్నారు. ఈ సత్యాన్ని సమాజానికి చెప్పేందుకు ఆదిశంకరాచార్యులు కృషి చేశారని మోడీ గుర్తు చేశారు.

read more  రాజకీయ పెత్తనం నుండి దేవాలయాలకు విముక్తి...: బిజెపి ఎంపీతో శారదాపీఠం స్వాత్మానందేంద్ర భేటి

ఆది గురు శంకరాచార్యుల సమాధి వద్ద ఆయన విగ్రహం ముందు కూర్చున్న అనుభూతిని వర్ణించడానికి మాటలు లేవన్నారు.అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారు. ఇటీవల అక్కడ దిపోత్సవం ఘనంగా జరిగిందన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు దేశం ఉన్నత లక్ష్యాలను కలిగి ఉందన్నారు మోడీ. 

కేదార్‌నాథ్  ఆలయంలో  ప్రధాని మోడీ శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రధానికి తీర్థప్రసాదాలు అదించారు. 

 

click me!