అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు కూలీల మృతి

Published : Nov 05, 2021, 07:26 AM ISTUpdated : Nov 05, 2021, 07:31 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు కూలీల మృతి

సారాంశం

ఏపీలో అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ Road Accidentలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. పామిడి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనంతపురం జిల్లా పామిడి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో Road accident చోటు చేసుకుంది. మృతులు గార్లదిన్నె మండలం కొప్పులకొండకు చెందినవారిగా గుర్తించారు. కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టిది.

గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారికి చికిత్స జరగుతోంది. మృతులను శంకరమ్మ, చౌడమ్మ, సావిత్రి, సుబ్బమ్మ. నాగవేణిలుగా గుర్తించారు. ప్రమాదం 44వ జాతీయ రహదారిపై జరిగింది.

ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు ఆటో నుజ్జు నుజ్జు అయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఇదిలావుండగా Ananthapur జిల్లా పెదవడుగూరు మండలం మిడతవండూరు వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పాదచారులపైకి కారు దూసుకుని వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను చాకలి నారాయణ, యాకోబులుగా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?