విశాఖపట్నం.. పెందుర్తిలో కలకలం రేపిన సైకో కిల్లర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యమీది కోపంతోనే.. మహిళల మీద ద్వేషం పెంచుకుని.. సైకో కిల్లర్గా మారాడు.
విశాఖపట్నం : అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య వివాహేతర సంబంధాన్ని చూసి.. అతను తట్టుకోలేకపోయాడు.. దీంతో ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకున్నాడు. కుటుంబానికి పూర్తిగా దూరమైపోయాడు. సైకో గా మారాడు. ఆడవాళ్లే లక్ష్యంగా హత్యలకు తెగబడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం రేపిన వరుస హత్యల నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన చందక రాంబాబు (49) భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2006లో కుటుంబంతో సహా హైదరాబాద్కు వెళ్లి రియల్ ఎస్టేట్ లో పని చేసేవాడు. అక్కడ బిల్డర్ మోసం చేశాడు. ఆ తర్వాత కుటుంబాన్ని అక్కడే ఉంచి, కొన్నాళ్ళు విశాఖలో ఉన్నాడు. 2016లో ఓ సారి హైదరాబాద్ కు వెళ్ళినపుడు భార్య ప్రవర్తన చూసి, నచ్చక ఆమెకు విడాకులు ఇచ్చాడు. పిల్లలు సైతం రాంబాబును దూరం పెట్టారు. పెందుర్తిలో అద్దెఇంట్లో ఉండగా.. అతని ప్రవర్తన చూసి, నచ్చక ఇంటి యజమాని ఖాళీ చేయించాడు.
undefined
ఈ క్రమంలోనే భార్యపై కోపంతో రాంబాబు మహిళా ద్వేషిగా మారాడు. అపార్ట్మెంట్ల నిర్మాణం వద్ద మహిళలు కుటుంబాలతో సహా కాపలాగా ఉంటారని అవగాహనతో వారినూ లక్ష్యంగా చేసుకున్నాడు. కిలో బరువున్న ఇనుపరాడ్ కొని, పట్టుకోవడానికి వీలుగా దానికి రంధ్రం చేసి, తాడు కట్టాడు రెండు చొక్కాలు వేసుకుని, వాటి మధ్యలో రాడ్ దాస్తుండేవాడు. జూలై 9న రాత్రి పెందుర్తి బృందావన్ గార్డెన్స్ లో అపార్ట్మెంట్ కాపలాదారు టి. నల్లమ్మపై దాడి చేశాడు. ఆమె గాయాలపాలయ్యింది. ఆగస్టు 8న చిన్నముసిడివాడలో అపార్ట్మెంట్ కాపలాదారులుగా ఉన్న ఎస్ అప్పారావు (72), లక్ష్మి(62)లను రాడ్ తో కొట్టి చంపాడు.
ఆగస్టు14న సుజాతనగర్ నాగమల్లి లేఅవుట్ లో వాచ్మెన్ ఎ. లక్ష్మిని హత్య చేశాడు. ఒకే తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. లక్ష్మి హత్య తర్వాత పోలీసులు వెంటనే రారులే అనుకుని రాంబాబు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండగా పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. చీకట్లోనే హత్యలు చేసే రాంబాబు. వారు మహిళలు కాదు నిర్ధారించుకునేందుకు ప్రైవేట్ భాగాలను పరిశీలించే వాడిని, ఎవరి పైన లైంగిక అఘాయిత్యాలకు పాల్పడే లేదని పోలీసులు తెలిపారు. కల్యాణ మండపాల్లో, ఆలయాల్లో తింటూ రాత్రిపూట ఎక్కడో ఒక చోట పడుకుంటూ గడుపుతున్నట్లు గుర్తించారు. మరోసారి రాంబాబును పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతామని సీపీ శ్రీకాంత్ వెల్లడించారు.