మంత్రులపై దాడి.. రంగంలోకి విశాఖ పోలీసులు, పలువురిపై కేసు నమోదు

Siva Kodati |  
Published : Oct 15, 2022, 09:20 PM IST
మంత్రులపై దాడి.. రంగంలోకి విశాఖ పోలీసులు, పలువురిపై కేసు నమోదు

సారాంశం

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటనపై నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటనపై నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. తమ నేతలపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేన శ్రేణులను పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu