నా వెంట్రుక కూడా పీకలేవ్ .. వెలగపూడి రామకృష్ణ బాబుపై విశాఖ ఎంపీ ఎంవీవీ ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 16, 2024, 06:21 PM ISTUpdated : Feb 16, 2024, 06:22 PM IST
నా వెంట్రుక కూడా పీకలేవ్ .. వెలగపూడి రామకృష్ణ బాబుపై విశాఖ ఎంపీ ఎంవీవీ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వైసీపీ నేత , విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతానని అంటున్నాడని, తన వెంట్రుక కూడా పీకలేడని ఎంపీ సవాల్ విసిరారు.

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వైసీపీ నేత , విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతానని అంటున్నాడని, తన వెంట్రుక కూడా పీకలేడని సవాల్ విసిరారు. రామకృష్ణ అవకాశవాదని.. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేశాడని ఎంపీ ఆరోపించారు.

వంగవీటి మోహనరంగాని నరికి పారిపోయాడని, అలాంటి రామకృష్ణ ఇప్పుడు రంగులు మార్చి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళ్తున్నాడని ఎంవీవీ ఎద్దేవా చేశారు. తాను బిల్డర్‌గా పనిచేస్తున్నానని, అంతేకాని వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని రామకృష్ణ విమర్శించారు. వంశీకృష్ణ లాంటి వారిపై స్పందించకూడదనే ఇంతకాలం మాట్లాడలేదని సత్యనారాయణ అన్నారు. 

2019లో వెలగపూడి వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు. తనపై అనుమానం పెంచుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తనపై గతంలో విమర్శలు చేస్తే తిరిగి చేశానని.. తానెప్పుడూ అనవసరంగా విమర్శలు చేయనని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వంశీ .. విజయసాయిరెడ్డి కారణంగా కార్పోరేటర్ అయ్యారని తెలిపారు. వంశీపై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్స్ వున్నాయని పేర్కొన్నారు. రంగాను వెలగపూడి రామకృష్ణ ఎలా చంపాడో బయటపెడతానని.. తన అక్రమాలపై ఆధారాలు వుంటే తీసుకురావాలని ఎంవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్