విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతం : నా భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఉన్నారు.. ఎంపీ ఎంవీవీ

Published : Jun 15, 2023, 12:52 PM ISTUpdated : Jun 15, 2023, 01:13 PM IST
విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతం : నా భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఉన్నారు.. ఎంపీ ఎంవీవీ

సారాంశం

విశాఖపట్నంలో ఎంపీ భార్య, కొడుకు, అడిటర్ ల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ఈ ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు.

విశాఖపట్నం : గురువారం ఉదయం విశాఖపట్నంలో కలకలం రేపిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కొడుకు శరత్, ఆడిటర్ల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ఈ ముగ్గురు క్షేమంగా ఉన్నారని స్వయంగా ఎంపీ తెలిపినట్లుగా ఎన్ టీవీ వార్తా కథనం ప్రసారం చేసింది. వీరు ముగ్గురి ఆచూకీ విశాఖ-ఏలూరు రోడ్డులో లభించింది. 

కిడ్నాపర్లు రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది. కిడ్నాప్ హేమంత్ అనే రౌడీషీటర్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు ఉన్నారని కూడా ఈ వార్తా కథనం చెబుతోంది. 

కిడ్నాప్ విషయం తెలియగానే ఎంవీవీ సత్యనారాయణ విశాఖకు బయలుదేరారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీ రియల్ ఎస్టే వ్యాపారంలో భాగస్వాములుగా తెలుస్తోంది. ముగ్గురి ఒక్కసారే ఎలా కిడ్నాప్ చేశారన్న విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ ఏలూరు రోడ్డులో ఈ ముగ్గురి ఆచూకీ కనిపెట్టి.. వారిని క్షేమంగా విడిపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026
మాది టైం వస్తది | YS Jagan Sensational Comments On Chandrababuy | AP Local Body Elections 2026