హైద్రాబాద్ లో గులాబీ జెండా జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు: పవన్ పై పేర్నినాని సెటైర్లు

Published : Jun 15, 2023, 12:23 PM ISTUpdated : Jun 15, 2023, 12:42 PM IST
హైద్రాబాద్ లో గులాబీ జెండా  జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు: పవన్ పై  పేర్నినాని  సెటైర్లు

సారాంశం

బీజేపీతో మైత్రి కొనసాగిస్తూనే తెలంగాణలో  మాత్రం గులాబీజెండాను  జేబులో పెట్టుకొని  పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని  మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.

తాడేపల్లి: హైద్రాబాద్ లో గులాబీ జెండాను  పట్టుకొని  పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని  మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురువారంనాడు  తాడేపల్లిలో  ఆయన మీడియాతో మాట్లాడారు.  బీజేపీతో  పవన్ కళ్యాణ్ కు  మైత్రి కొనసాగుతుందన్నారు. కానీ  హైద్రాబాద్ లో  గులాబీ జెండాను  జేబులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని  ఆయన విమర్శించారు. తన  సినిమా టిక్కెట్ల కోసం  కేసీఆర్ తో  పవన్ కళ్యాణ్  చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడన్నారు.

ఏపీపై  ఇష్టానుసారం విమర్శలు చేస్తున్న  హరీష్ రావు పై  పవన్ కళ్యాణ్ ఎందుకు  నోరు మెదపడం లేదని ఆయన  ప్రశ్నించారు.  తాను పుట్టిన  నేల గురించి ప్రజల గురించి మాట్లాడిన   బీఆర్ఎస్ పై  ఎందుకు మాట్లాడడం లేదని ఆయన పవన్ కళ్యాణ్ ను  అడిగారు. పవన్ కళ్యాణ్ కు  ఆంధ్రప్రదేశ్ లో ఓటుందా అని ఆయన అడిగారు.  హైద్రాబాద్ లోనే  పవన్ కళ్యాణ్ ఉంటున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు

also read:మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని

హరీష్ రావు  ఏపీ ప్రజలను తిడితే  పవన్ కళ్యాణ్  మద్దతిచ్చారని  ఆయన  ఆరోపించారు. చంద్రబాబు కోసం  పవన్ కళ్యాణ్  ఇంత దిగజారిపోతారా అని  ఆయన  ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ తప్పులను ఎత్తిచూపుతానన్నారు. ఏం చేస్తావో చేసుకో అని పేర్ని నాని  పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. తన చేతిపై  వెంట్రుక కూడ పీకలేవని  ఆయన  పవన్ కళ్యాణ్ నుద్దేశించి  వ్యాఖ్యానించారు. చంద్రబాబు  పచ్చగా ఉండాలనేది  పవన్ కళ్యాణ్ వ్యూహంగా  కన్పిస్తుందన్నారు. వంతాడలో లాటరైట్ మైనింగ్ పై  చంద్రబాబు చొక్కా పట్టుకున్నావా అని  పేర్ని నాని ప్రశ్నించారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations