విశాఖ కార్పోరేటర్ సూర్యకుమారి ఆకస్మిక మరణం

Published : Mar 22, 2021, 07:30 AM IST
విశాఖ కార్పోరేటర్ సూర్యకుమారి ఆకస్మిక మరణం

సారాంశం

విశాఖ కార్పోరేటర్ సూర్యకుమారి ఆకస్మికంగా మరణించారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసి ఎన్నికల్లో సూర్యకుమారి కార్పోరేటర్ గా విజయం సాధించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పారిశ్రామికవాడలో విషాద వాతావరణం నెలకొంది. జీవీఎఎసీ 61వ వార్డు నుంచి కార్పోరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మికంగా మరణించారు. 

సూర్యకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల జరిగిన విశాఖ మహాగనగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో సూర్యకుమారి 61వ వార్డు నుంచి కార్పోరేటర్ గా విజయం సాధించారు.  వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ మేయర్ పదవి వైసీపీ కైవసం అయిన విషయం తెలిసిందే. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం