కొత్తగా 368 మందికి పాజిటివ్.. గుంటూరులో తీవ్రత: ఏపీలో 8,93,734కి చేరిన కేసులు

By Siva KodatiFirst Published Mar 21, 2021, 7:19 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌లలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌లలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 368 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరుకుంది.

కోవిడ్ కారణంగా నిన్న ఏ ఒక్కరూ చనిపోలేదు. రాష్ట్రంలో వైరస్ బారినపడి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,189కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,188 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 263 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,84,357కి చేరుకుంది. నిన్న 31,138 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,47,36,326కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 40, చిత్తూరు 40, తూర్పుగోదావరి 20. గుంటూరు 79, కడప 10, కృష్ణా 37, కర్నూలు 49, నెల్లూరు 20, ప్రకాశం 6, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 39, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 9 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

: 21/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,90,839 పాజిటివ్ కేసు లకు గాను
*8,81,462 మంది డిశ్చార్జ్ కాగా
*7,189 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,188 pic.twitter.com/t6dvC5yL9l

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!