రోడ్డు ప్రమాదంలో గాయపడినవారి ప్రాణాలు నిలిపిన పోలీసులు

Published : Mar 22, 2021, 07:19 AM IST
రోడ్డు ప్రమాదంలో గాయపడినవారి ప్రాణాలు నిలిపిన పోలీసులు

సారాంశం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు నిలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన కొద్ది సేపట్లోనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు.

నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు రహదారి ప్రమాదంలో గాయపడినవారి ప్రాణాలు నిలిపిచారు. నూజివీడు పట్టణ పరిధిలోని అన్నవరం బైపాస్ రోడ్డు నందు ఎదురెదురుగా వస్తున్న లారీలు రెండు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు లారీల లో ఉన్న డ్రైవర్, సిబ్బంది క్యాబిన్ ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న నూజివీడు పట్టణ ఎస్ఐ గణేష్ గారు, బ్లూ కోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ మల్లేశ్వరరావు, హోం గార్డ్ జీవన్ కలిసి క్యాబిన్ లో చిక్కుకుపోయి కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్లను బయటకు తీశారు.

వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించి వారి ప్రాణాలు నిలిపారు. క్షణం మాత్రం ఆలస్యం చేసినప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న వారిని వెంటనే ఆలస్యం చేయకుండా, వైద్యశాలకు తరలించి వారి ప్రాణాలను నిలిపిన ఎస్సై గారిని సిబ్బందినీ  ఎస్పీ, నూజివీడు డిఎస్పీ , నూజివీడు సిఐ ప్రత్యేకంగా అభినందించారు. రాంపూర్ లోని జిల్లా ఆస్పత్రిలో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu