
Youth in Andhra Pradesh Express Affection for Pakistan Flag: భారతదేశంలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం ఇటీవల తీవ్ర చర్చలకు దారితీసింది. ఉగ్రదాడులు జరుగుతున్నా, భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నా, కొందరు వ్యక్తులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం, వారికి అనుకూలంగా ప్రవర్తించడంపై ఆగ్రహాం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో చూడా చోటుచేసుకుంది.
నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ ఘటనపై ధర్మ రక్షా దళ్ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించి, పాకిస్తాన్ జెండాలను రోడ్డుపై పడేసి, వాటిని తొక్కిపడేసి ఆందోళనకు దిగారు.
ఆ తర్వాత పలువరు యువకులు ఆ జెండాలను జాగ్రత్తగా తీసి పక్కన పెడుతూ అనుకూలంగా నడుచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ కు అనుకూలంగా నడుచుకోవడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగాయి. సొంత దేశంలో పాకిస్తాన్ జెండాపై ప్రేమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. జనసేన అధినేత ఇప్పటికే పాక్ అనుకూలంగా ఉండేవాళ్లను హెచ్చరించారు. పాకిస్తాన్ జెండాను ప్రదర్శించే వారు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఫైర్ అయ్యారు.