మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Published : May 01, 2025, 01:36 PM ISTUpdated : May 01, 2025, 01:47 PM IST
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సారాంశం

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. చార్జ్‌షీట్ కొట్టివేత పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. 

Mohan Babu : ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఎన్నికల నియమావళిని ఉళ్లంఘించిన కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే... ఈ కేసులో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని... ఈ విషయంలో ఎలాంటి మినహాయింపుమ లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  

2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు తన విద్యాసంస్థల ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపులో జాప్యం చేస్తున్నారంటూ తిరుపతిలో ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఈ ధర్నా చేపట్టడటంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ ఎన్నికల నియమావళిని ఉళ్ళంఘన కేసులో మోహన్ బాబు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు హాజరుకాకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

మోహన్ బాబు ఎన్నికల నియమావళి ఉళ్లంఘన కేసుపై 2021 లో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. అయితే ఈ చార్జ్ షీట్ కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. తిరుపతి మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దీంతో మోహన్ బాబు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. 

తిరుపతిలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్  విద్యాసంస్ధలను నిర్వహిస్తున్నారు. అయితే తన విద్యాసంస్థలకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించడంలేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, సిబ్బందితో కలిసి తిరుపతిలో ధర్నాకు దిగారు. మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దకు కుమారులు మంచు విష్ణు, మనోజ్ ఈ దర్నాలో పాల్గొన్నారు. తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై వీరు బైఠాయించి తమ నిరసన తెలిపారు. 

అయితే ఈ ధర్నా చేసే సమయంలో ఆంధ్ర  ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.  దీంతో పోలీసులు మోహన్ బాబుపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించిన కేసులు పెట్టారు. అంతేకాదు ధర్నాకు అనుమతి తీసుకోలేదని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విషయంలోనే ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?