అన్న క్యాంటీన్‌కు భారీగా వచ్చిన జనం.. చేయి చేసుకున్న మున్సిపల్ కమిషనర్

First Published Jul 12, 2018, 4:23 PM IST
Highlights

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అక్కడ భోజనం చేసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఎక్కువ మంది రావడంతో అక్కడున్న సిబ్బంది వారిని కంట్రోల్ చేయలేకపోయారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అక్కడ భోజనం చేసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఎక్కువ మంది రావడంతో అక్కడున్న సిబ్బంది వారిని కంట్రోల్ చేయలేకపోయారు. విషయం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి వరకు వెళ్లడంతో అక్కడికి చేరుకున్న కమిషనర్ జనాన్ని పక్కకు తోసేశారు.. కొందరిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆయన తీరుపై జనం భగ్గుమంటున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్ల’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీరోజు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రజలకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.. త్వరలో దీనిని మరిన్ని మున్సిపాలిటీలకు వర్తించనున్నారు.

"

click me!