మస్కట్ లో అనుమానాస్పదంగా విజయవాడ మహిళ మృతి.. (వీడియో)

Published : Sep 18, 2021, 09:19 AM IST
మస్కట్ లో అనుమానాస్పదంగా విజయవాడ మహిళ మృతి..  (వీడియో)

సారాంశం

ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉషారాణికి, విజయవాడకు చెందిన యల్ల భాస్కర్ కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇంకా పిల్లలు లేక పోవడంతో.. ఆ కారణంతో తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టేవారని.. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఉషారాణి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విజయవాడ : బెజవాడ లో విషాదం చోటు చేసుకుంది. ఉషారాణి అనే మహిళ మస్కట్ లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఉషారాణి కుటుంబ సభ్యులు మాత్రం అల్లుడే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నాడని అరోపిస్తున్నారు.

"

ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉషారాణికి, విజయవాడకు చెందిన యల్ల భాస్కర్ కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇంకా పిల్లలు లేక పోవడంతో.. ఆ కారణంతో తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టేవారని.. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఉషారాణి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ రోజు ఉషారాణి మృతదేహం మస్కట్ నుండి విజయవాడ చేరుకుంది. నిన్నటి నుంచి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ ఆటోనగర్ లోని అత్తింటివారి వద్ద మృతిరాలి తల్లిదండ్రులు, బందువులు ఎదురుచూస్తున్నారు. 

అయితే,  మృతదేహం విజయవాడలోని అత్తింటికి చేరుకున్నా.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులకు  చూపించేందుకు మృతిరాలి అత్తింటివారు నిరాకరిస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్