కొట్టుకుందాం అంటే.. కొట్టేసుకుందాం, డేట్ .. టైం ఫిక్స్ చేయండి: జగన్‌కు కేశినేని సవాల్

Siva Kodati |  
Published : Oct 22, 2021, 07:12 PM IST
కొట్టుకుందాం అంటే.. కొట్టేసుకుందాం, డేట్ .. టైం ఫిక్స్ చేయండి: జగన్‌కు కేశినేని సవాల్

సారాంశం

టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు (ys jagan) సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయంలో 36 గంటల దీక్ష చేస్తున్న చంద్రబాబుకు ఆయన శుక్రవారం సంఘీభావం ప్రకటించారు.

టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు (ys jagan) సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయంలో 36 గంటల దీక్ష చేస్తున్న చంద్రబాబుకు ఆయన శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. చాలా కాలం తరువాత ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు చేశారు. దొంగ చాటుగా టీడీపీ ఆఫీసులకు వచ్చి విధ్వంసం చేయటం కాదని... విజయవాడలో ఏ గ్రౌండ్‌లో తేల్చుకుందామో చెప్పాలంటూ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డేట్ , టైం చెబితే డైరెక్ట్ ఫైట్ చేసుకుందాం.. రోజు ఇలా వద్దు.. మేము రెఢీ..ఒకే సారి తేల్చేద్దాం అంటూ సవాల్ విసిరారు. ఎవరో ఎమ్మెల్సీ పదవి కోసమో.. మంత్రి పదవి కోసమో ఆశ పడి ఇటువంటి విధ్వంసాల ద్వారా ముఖ్యమంత్రి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంను సంతోషపెట్టేందుకు గూండాయిజం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు.

ఇలాంటి వేధింపు కేసులు వద్దని నాని హితవు పలికారు. అదే విధంగా ప్రజలంతా గతంలో చంద్రబాబు పాలన అయిదేళ్ల కాలం.. ఇప్పుడు జగన్ పాలన సాగించిన రెండున్నరేళ్ల కాలం బేరీజు వేసుకోవాలని కోరారు. మిగిలిన రెండున్నరేళ్ల కాలంలో ఇంకా ఎటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందోనంటూ కేశినేని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నానని.. అందరూ ఈ ప్రభుత్వం తీరుపైన అప్రమత్తంగా ఉండాలని కేశినేని సూచించారు.

Also Read:నిన్నటి వరకు రుసరుసలు.. నేడు చంద్రబాబు దీక్షకు మద్ధతు, కేశినేని నాని అలక వీడారా.. ?

కాగా.. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు నాయుడిపై కేశినేని నాని తన వ్యతిరేకతను కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) బహిరంగంగానే ప్రదర్శించారు. విజయవాడలోని తన కార్యాలంయ వెలుపల గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని ఆయన తోలగించారు.  Chandrababu చిత్రం పటం స్థానంలో తాను రతన్ టాటాతో (ratan tata) కలిసి ఉన్న ఫొటోను అమర్చుకున్నారు కేశినేని భవన్ (kesineni bhavan) బయట ఏర్పాటు చేసిన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల ఫోటోలను, ఇతర ముఖ్య నాయకుల ఫోటోను కూడా తొలగించారు. ఆ ఫొటోల స్థానంలో టాటా ట్రస్టు, (tata trust) తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన వివరాలతో ఉన్న ఫొటోలను పెట్టుకున్నారు. ఈ స్థితిలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. కేశినేని బిజెపిలో (bjp) చేరుతారా అనే ప్రచారం కూడా జరిగింది. 

తాను గానీ, తన కూతురు గానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని Kesineni nani చంద్రబాబుకు చెప్పారు. అయితే తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పారు. బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్నలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ నీర్ణయం తీసుకున్నట్లు భావించారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఆ నాయకులు కేశినేని నానిపై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్