ఏపీలో బూతులకు పురుడుపోసిందే జగన్.. ఇప్పుడు సంస్కృతి గురించి వల్లెవేస్తున్నారు: టీడీపీ

By telugu teamFirst Published Oct 22, 2021, 6:14 PM IST
Highlights

వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిపై, వైసీపీపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో బూతులకు పురుడుపోసిందే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డివారి శ్రీనివాసుల రెడ్డిలు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనే సంస్కృతి గురించి వల్లెవేయడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని అన్నారు.
 

అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై TDP నేతలు ఫైర్ అయ్యారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా, గౌరవ మర్యాదల్లేకుండా హద్దులు మీరి మాట్లాడింది YCP చీఫ్ Jagan Mohan Reddyనే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డివారి శ్రీనివాసులరెడ్డిలు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం వీరిద్దరు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బూతులకు పురుడుపోసిందే జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జగన్ మాటలను ఎవరు సమర్థిస్తారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ఉండి జగన్ అనకూడని మాటలు అన్నాడని అన్నారు.  

బాబుని బంగాళాఖాతంలో కలుపుతామని, ,చెప్పుతో కొట్టాలని, ఊళ్లల్లో తిరగకుండా రాళ్లతో కొట్టాలని జగన్ అన్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటాననీ జగన్ అన్నాడని గుర్తుచేశారు. ఇప్పుడు నీతులు వల్లెవేస్తున్న జగన్ మోహన్ రెడ్డి అప్పుడు సిగ్గులేకుండా ఎన్ని మాటలు మాట్లాడాడు అని అన్నారు. రాష్ట్రంలో అసలు బూతులకు పురుడుపోసిన వ్యక్తే ఆయన అని విమర్శలు చేశారు. నేడు ఆయన సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లడటం నిజంగా రాష్ట్ర ప్రజల ఖర్మేనని అన్నారు. 

Also Read: ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం, పోలీసులకూ శిక్ష తప్పదు: లోకేశ్ వ్యాఖ్యలు

పట్టాభిని అరెస్టు చేయడంలో చూపించిన చిత్తశుధ్దిని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, చిత్తూరుకు చెందిన వైసీపీ నేత, రెస్కో చైర్మన్‌నూ అరెస్టు చేయడంలో చూపించాలని అన్నారు. ప్రతిపక్ష నేతపై బాంబులు వేస్తామని బాహాటంగానే బెదిరించినవారిపై ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

తామూ సీమవాసులమేనని, అసలైన రెడ్డు టీడీపీలోనే ఉన్నారని, కల్తీ రెడ్లే వైసీపీలో ఉన్నారని అన్నారు. అలసు రెడ్డు ఏకమైతే వైసీపీ నేతలెవరూ రాయలసీమలో తిరుగలేరని హెచ్చరించారు. తిరుమల స్వామివారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించని వారే కల్తీ రెడ్డు అని ఎద్దేవా చేశారు. పట్టాభితో చంద్రబాబు మాట్లాడించారని అంటున్నారని, అదే నిజమని నమ్మితే మరి వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కుప్పానికి చెందిన వైసీపీ నేతల మాటలు కూడా జగన్ చెప్పించినవేనా? అని నిలదీశారు.

తెలుగుదేశంలో బూతులుమాట్లాడే విధానమే లేదని, కించిత్ మాట అన్నా చంద్రబాబు ఊరుకోరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డివారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు. అలాంటిది ఆయనే టీడీపీవారితో మాట్లాడిస్తున్నారంటే ఏమైనా అర్థమున్నదా? అని అడిగారు. 1988లోనే ఓ కేసులో తాను ఏ1గా ఉన్నారని, ధైర్యం లేక, చేతగాక కూర్చున్నామని అనుకోవద్దని, పెద్దాయన కోసం, ఆయన్ని గౌరవించే క్రమంలో సంయమనంతో ఉంటున్నామని వివరించారు.

click me!