ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో ఒకరు ఐవోబీ మాజీ మేనేజర్

By Siva Kodati  |  First Published Oct 22, 2021, 6:33 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో ఎఫ్‌డీ స్కామ్‌లో (ap fd scam) ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్... ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌లలో రూ.15 కోట్ల ఎఫ్‌డీలు గల్లంతైన సంగతి తెలిసిందే. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో ఎఫ్‌డీ స్కామ్‌లో (ap fd scam) ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్... ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌లలో రూ.15 కోట్ల ఎఫ్‌డీలు గల్లంతైన సంగతి తెలిసిందే. గిడ్డంగుల శాఖ కేసులో ఐవోబీ బ్యాంక్ అప్పటి మేనేజర్ జీ సందీప్ కుమార్‌ను .. ఆయిల్ ఫెడ్ నిధుల దుర్వినియోగం కేసులు పూసలపాటి యోహన్ రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కామ్‌లో భాగస్వాములుగా వున్న మరో ఏడుగురిని ఇప్పటికే తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన వారిని .. పీటీ వారెంట్లపై కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. 

కొట్టేసిన రూ.15 కోట్లను వివిధ ఖాతాలకు తరలించారు నిందితులు. బ్యాంక్ ఖాతాలో ప్రస్తుతం వున్న రూ.77 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. హవాలా ద్వారా కోట్ల నిధులను దారి మళ్లీంచారు నిందితులు. ఎఫ్‌డీల స్కామ్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశామని డీసీసీ హర్షవర్థన్ తెలిపారు. 77 లక్షలు ఫ్రీజ్ చేశామని.. 11 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. బ్యాంక్ మేనేజర్లతో నిందితులు ముందుగానే డీల్ కుదుర్చుకున్నారని..ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎఫ్‌డీలు తరలించారని డీసీపీ వివరించారు. రూ.2.9 కోట్లను మాత్రమే ఎఫ్‌డీ నుంచి తరలించారని హర్షవర్థన్ అన్నారు. 

Latest Videos

undefined

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను అక్టోబర్ 15న ప్రభుత్వానికి వెనక్కిచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) (indian overseas bank). ఈ బ్యాంక్ బ్రాంచ్‌లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్‌డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. దీనిపై ఐవోబీ యాజమాన్యం స్పందించింది. దీంతో గిడ్డంకుల శాఖ అకౌంట్‌లో రూ.9.6 కోట్లను బ్యాంక్ డిపాజిట్ చేసింది. వడ్డీ డబ్బులు కూడా ఎఫ్‌డీల మెచ్యూర్ అయ్యేనాటికి ఇస్తామని ఐవోబీ తెలిపింది. బ్యాంక్ సిబ్బంది సహకారంతో స్కామ్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనిపై గిడ్డంకుల శాఖ ఎండీ స్పందించారు. అమౌంట్ అంతా వెనక్కి వచ్చిందని ఆయన తెలిపారు. 

ALso Read:ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ప్రభుత్వానికి గల్లంతైన సొమ్ము వెనక్కిచ్చిన ఐవోబీ.. ఎంతంటే..?

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గత గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ఐవోబీ, సప్తగిరి బ్యాంకుల్లో ఎఫ్‌డీలను సొంత అకౌంట్లకు బదిలీ చేశారు నిందితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు, అదనపు సమాచారం కోరారు. గల్లంతైన సొమ్ము చెల్లించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి ఆయా బ్యాంకు యాజమాన్యాలు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేస్తామని తెలిపింది. 

తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన ముఠా ఏపీ ప్రభుత్వానికి చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని గుర్తించారు పోలీసులు. ఈ మేరకు ఏపీ అధికారులకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. telugu akademi స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన saikumar ముఠా ap ware housing corporation, ap oil federation ల నుండి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

click me!