బైక్‌పై స్టంట్లు చేస్తూ యువతి డ్రైవింగ్ .. షాకిచ్చిన బెజవాడ పోలీసులు, ఏం చేశారంటే..?

Siva Kodati |  
Published : Apr 19, 2023, 08:59 PM IST
బైక్‌పై స్టంట్లు చేస్తూ యువతి డ్రైవింగ్ .. షాకిచ్చిన బెజవాడ పోలీసులు, ఏం చేశారంటే..?

సారాంశం

విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌పై రిస్కీ స్టంట్లు చేసిన యువతిపై పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తనూజకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఇందుకోసం రిస్కీ స్టంట్లు చేస్తూ కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఓ యువతి చేసిన రీల్స్ ఆమెను చిక్కుల్లో పడేసింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు యాక్షన్‌లోకి దిగారు. 

వివరాల్లోకి వెళితే.. తనూజ అనే యువతి విజయవాడ కనకదుర్గ వారధిపై నిబంధనలకు విరుద్ధంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేసి అనంతరం దానిని ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ఆమె అనుకున్నట్లుగానే భారీగా లైక్స్, షేర్‌లు వచ్చాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం దీనిని ప్రశ్నించడంతో పాటు విజయవాడ పోలీసులకు ట్యాగ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనూజపై యాక్షన్‌లోకి దిగారు. వీడియో ఆధారంగా ఆమె బైక్‌ నెంబర్‌ను గుర్తించి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తనూజకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం