మద్యం మత్తులో వివాదం.. హత్య: మహేశ్ కేసులో జరిగింది ఇదీ..!!

Siva Kodati |  
Published : Oct 20, 2020, 10:15 PM IST
మద్యం మత్తులో వివాదం.. హత్య: మహేశ్ కేసులో జరిగింది ఇదీ..!!

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి మహేష్‌ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి మహేష్‌ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు.

మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్‌ హత్య జరిగినట్లు స్ఫష్టమైందన్నారు. మహేష్‌ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు.

మద్యం మత్తులో జరిగిన వివాదమే హత్యకు దారి తీసిందని... హైదరాబాద్‌కి చెందిన సాకేత్ రెడ్డి మహేష్‌పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందని కమీషనర్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ కూడా ఉన్నట్లుగా నిర్థారణ చేసినట్లు చెప్పారు.

సాకేత్ రెడ్డికి విజయవాడలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణా రెడ్డి స్నేహితుడు. రాధాకృష్ణా రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ మద్యం తాగటానికి వచ్చారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి హైదరాబాద్ నుంచి సాకేత్ రెడ్డిని పిలిపించినట్లు సీపీ వెల్లడించారు.

అయితే  కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ మద్యం మత్తులో మహేష్‌తో గొడవపడ్డాడని.. ఈ నేపథ్యంలోనే సాకేత్‌ తుపాకీతో మహేష్‌పై కాల్పులు జరిపాడని పోలీస్ కమీషనర్ వివరించారు.

సాకేత్ రెడ్డి ఎప్పుడూ రివాల్వర్‌ను తన వెంటే వుంచుకుంటాడని.. దానిని బీహార్‌లోని గయలో రూ.45 వేలకు కొనుగోలు చేసినట్లు సీపీ చెప్పారు. కిడ్నాప్ వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై కేసులు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని కమీషనర్ పేర్కొన్నారు

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy